ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.. మోడీ వార్షికోత్సవం!
రాజకీయాల్లో ప్రత్యర్థుల బలహీనతే అధికారంలో ఉన్నవారికి ఆయువుపట్టు. ఈ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మరింత దూకుడుగా ఉంది.;
రాజకీయాల్లో ప్రత్యర్థుల బలహీనతే అధికారంలో ఉన్నవారికి ఆయువుపట్టు. ఈ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మరింత దూకుడుగా ఉంది. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా.. ఎక్కడ ఎలా నిర్వీర్యం చేయాలో తెలిసిన నాయకుడిగా ప్రధాని మోడీ రాజకీయ వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ ఎమర్జెన్సీ ఆయుధానికి పదును పెంచారు.
1975, జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరమ్మ దేశంలో ఎమర్జీని విధించి.. ప్రజల ప్రాధమిక హక్కులపై ఉక్కుపాదం మోపారు. తనను విభేదించిన నాయకులను, పత్రికా సంపాదకులను కూడా జైళ్లలోకి నెట్టా రు. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ.. ఈ ఎమర్జెన్సీ భారత రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా చెబు తారు. అప్పటి ప్రధాని ఇందిరమ్మ ఎన్ని మేళ్లు చేసినా.. ఈ ఒక్క నిర్ణయంతో అవన్నీ తుడిచి పెట్టుకు పోయి.. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చిన ఘట్టం కూడా ఇదే.
తాజాగా దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు జరిగిన అరాచకాలపై ప్రజల్లో చర్చ పెట్టేందుకు సిద్ధమయ్యారు. నిన్న మొన్నటి వరకు 11 సంవత్సరాల తన పాలనపై బీజేపీ నాయకులు ఎలా ప్రచారం చేశారో.. ఇప్పుడు వారే.. ఈ కార్యక్రమానికి కూడా నడుం బిగిం చనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి బీజేపీకి దిశానిర్దేశం చేశారు.
ఏం చేస్తారు?
+ బీజేపీ నాయకులు నాటి ఎమర్జెన్సీని ప్రజలకు వివరించి.. కాంగ్రెస్‌పై మరింత వ్యతిరేకత పెంచనున్నా రు. ప్రసంగాలు.. నాటి నిర్ణయాలు.. అప్పట్లో ఇబ్బందులు పడిన వారి ఇంటర్వ్యూలను ప్రచారం చేస్తారు.
+ యూట్యూబ్ సహా.. ఇతర సామాజిక మాధ్యమాల్లో నాటి ఎమర్జెన్సీకి సంబంధించిన చిత్రాలు, వీడియో లను జోరుగా వైరల్ చేస్తారు. సభలు సమావేశాలు నిర్వహించి.. కాంగ్రెస్ ను తూర్పారబట్టనున్నారు.