ఆర్ఎస్ఎస్ తో నో పేచీ : మోడీ రిటైర్ అయ్యేది అపుడేనా... !
బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ .ఆర్ఎస్ఎస్ కాషాయం పార్టీ మీద గుర్రు మీద ఉంది అన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాట.;
బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ .ఆర్ఎస్ఎస్ కాషాయం పార్టీ మీద గుర్రు మీద ఉంది అన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. అయితే అది కాస్తా ఆగస్టు నెలలో చల్లారిపోయింది. రెండు వైపుగా రాజీలు కుదిరాయని ప్రచారం సాగుతోంది. బీజేపీకి .ఆర్ఎస్ఎస్ కి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అటూ ఇటూ ఇపుడు అంతా అంటున్నారు. ప్రధానిగా మోడీ కానీ .ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కానీ ఇద్దరూ కలసి మెలసి ముందుకు సాగబోతున్నారు అన్నది తాజా చిత్రంగా ఆవిష్కృతం అవుతోంది.
నాడు అలా నేడు ఇలా :
సరిగ్గా రెండు నెలల క్రితం జూలైలో జరిగిన నాగ్ పూర్ మీటింగ్ లో .ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్ళు నిండిన వారు హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని సంచలన ప్రకటన చేశారు. అది నరేంద్ర మోడీని ఉద్దేశించినదే అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఎందుకంటే సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 ఏళ్ళు నిండుతున్నాయి. దాంతో .ఆర్ఎస్ఎస్ గురి మోడీ మీదనే అని అనుకున్నారు. విపక్షాలు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో స్పందించాయి. అయితే బీజేపీ నుంచి అయితే పెద్దగా స్పందన రాలేదు. కట్ చేస్తే లేటెస్ట్ గా ఢిల్లీలో జరిగిన ఆర్ ఎస్ ఎస్ వందవ వార్షికోత్సవాలలో అదే మోహన్ భగవత్ మాట్లాడుతూ 75 నిబంధన గురించి తాను ఏమీ మాట్లాడలేదని అన్నారు. అంతే కాదు బీజేపీని తాము ఎక్కడా నియంత్రించలేమని కూడా స్పష్టం చేశారు.
ఇద్దరికీ మేలుగా :
ఇదిలా ఉంటే మోహన్ భగవత్ కూడా ఇదే నెలలో 75 ఏళ్లు నిండిన వారు అవుతారు. అంటే అటు మోడీ కానీ ఇటు మోహన్ భగవత్ కానీ ఇద్దరూ ఈ ఏజ్ నిబంధనతో తప్పుకోవాల్సి వస్తోంది. ఢిల్లీ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ తాను కానీ ఎవరు అయినా .ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే ఎనభై ఏళ్ళు అయినా పదవి లో కొనసాగాల్సిందే అని కూడా అన్నారు. దానిని బట్టి మోడీ మరో టెర్మ్ పీఎం గా ఉన్నా ఓకే అన్నట్లుగా సంకేతం ఇచ్చేశారు అని చెప్పుకున్నారు. ఈ విధంగా మోహన్ భగవత్ మోడీ సైతం తమ పదవులలో మరిన్నాళ్ళు కొనసాగుతారు అని అంటున్నారు.
గ్యాప్ ఎందుకు అలా :
నిజానికి చూస్తే బీజేపీకి .ఆర్ఎస్ఎస్ కి మధ్య గ్యాప్ 2019 ఎన్నికల ఫలితాల తరువాత వచ్చాయని చెబుతారు. బీజేపీకి ఏకంగా 304 సీట్లు సొంతంగా రావడంతో బీజేపీలో అతి ధీమా వచ్చింది అని చెబుతారు. పైగా .ఆర్ఎస్ఎస్ సహకారం లేకుండా తాము ముందుకు సాగగలమన్న ఆలోచనలు కూడా వచ్చాయని చెబుతారు. ఆ అయిదేళ్ళ పాలనలో .ఆర్ఎస్ఎస్ ని పూర్తిగా పక్కన పెట్టారు అని అంటారు. అయితే .ఆర్ఎస్ఎస్ సైతం గుర్రుగా ఉన్నా బీజేపీ బలం చూసి ఏమీ చేయలేకపోయింది అని అంటారు. ఇక 2024లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి ఆమడ దూరం వెనక్కి వెళ్ళడంతో కమలం పార్టీలో అంతర్మధనం మొదలైంది అదే సమయంలో బీజేపీ చేస్తున్న తప్పులు అన్నీ కూడా .ఆర్ఎస్ఎస్ అప్పటి నుంచే మెల్లగా గుర్తిస్తూ సమయానుకూలంగా ప్రకటనలు ఇస్తోంది అని చెబుతారు. ఇలా గ్యాప్ పెరిగిపోయి చివరికి మోడీకి 75 ఏళ్ళ ఏజ్ కండిషన్ దాకా వెళ్ళింది అని అంటారు.
.ఆర్ఎస్ఎస్ ని పొగుడుతూ :
ఈ క్రమంలో .ఆర్ఎస్ఎస్ ని ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 15 జెండా పండుగ వేళ ఎర్ర కోట మీద నుంచి ఇచ్చిన స్పీచ్ లో ప్రత్యేకంగా కొన్ని నిముషాలు .ఆర్ఎస్ఎస్ ని పొగడడానికే కేటాయించారు. .ఆర్ఎస్ఎస్ దేశానికి చేసీ సేవలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తుతించారు. దాంతో .ఆర్ఎస్ఎస్ ని ఎందుకు ఆయన ఇంతలా కితాబులు ఇస్తున్నారు అన్న చర్చ కూడా సాగింది. అయితే దాని పర్యవసానం కూడా ఢిల్లీలోని .ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పీచ్ లో కనిపించింది. 75 ఏళ్ళ ఏజ్ నిబంధన ఏదీ లేదని తేల్చేశారు. అలా మోడీకి భారీ రిలీఫ్ లభించింది అని చెప్పాలి.
మోడీ తప్పుకునేది అప్పుడేనా :
తాజా పరిణామాలతో నరేంద్ర మోడీ మరో పదేళ్ళ పాటు దేశానికి ప్రధానిగా కొనసాగేందుకు వీలు కలుగుతోంది అని అంటున్నారు. ఈ టెర్మ్ అయిదేళ్ళూ ఎలాగూ ఆయనే ఉంటారు. 2029 ఎన్నికల తరువాత కూడా బీజేపీ గెలిస్తే మరో టీర్మ్ మోడీ ప్రధానిగా నాలుగవ సారి పదవీ ప్రమాణం చేస్తారు అలా 2034 దాకా కొనసాగేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏమిటి అంటే బీజేపీకి .ఆర్ఎస్ఎస్ అండ కావాలి. అది లేకుండా సొంతంగా వెళ్తే 2024 లో వచ్చిన ఫలితాలు వస్తాయన్నది ఒక చర్చగా ఉంది. అలాగే .ఆర్ఎస్ఎస్ అజెండా అమలు కావాలంటే దేశంలో బీజేపీ బలమగా ఉండడమే కాదు అధికారంలో ఉండాలి. అపుడే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు అయినా లేక రామ మందిరం నిర్మాణం లాంటివి అయినా సాకారం అవుతాయి. ఇలా ఉభయతారకంగా వ్యవహారం ఉంది. అందుకే ఈ రాజీ. ఇక మీదట ఏ విధంగానూ లేదు పేచీ అని అంటున్నారు.