మోడీ మంత్రివర్గ ప్రక్షాళన.. మర్మమేంటి?
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియపై ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా.. పలువురు బీజేపీ అగ్రనాయకులు సుదీర్ఘంగా మంతనాలు సాగిస్తున్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది. త్వరలోనే జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయడం ఖాయమని తెలుస్తోంది.
ఇప్పటికే పలువురు మంత్రులకు రాజ్యసభ సీట్లు దక్కలేదు. దీంతో వారు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ఒకరు ఇప్పటికే రాజీనామా సమర్పించారు. దీంతో ఆయా స్థానాలతో పాటు మరిన్ని స్థానాలు కూడా ఖాళీ అవుతాయని సమాచారం. ముఖ్యంగా కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్‌చేస్తున్నట్టుగా నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించనున్నారు. ఇదే జరిగితే.. కేంద్రంలో భారీ మార్పు వచ్చినట్టుగానే భావించాలని అంటున్నారు.
అలాగే.. ప్రస్తుతం నాలుగు శాఖలు చూస్తున్న అశ్వినీ వైష్ణవ్ సహా.. మరో ఇద్దరు మంత్రులను కూడా కొన్ని శాఖలకే పరిమితం చేయనున్నారు. ముఖ్యంగా పంజాబ్ లో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కమ ల నాధులు ఆ రాష్ట్రానికి కేంద్రంలో ప్రాధాన్యం పెంచేలా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చి కమల దళంలో చేరిన రాఘవ్ చద్దాకు.. కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
అలానే.. యూపీకి చెందిన కేంద్ర మంత్రులను తప్పించి.. వారికి రాష్ట్రంలో ఎన్నికల బాధ్యతలు అప్పగి స్తారని సమాచారం. వచ్చే ఏడాదిలో ఇక్కడ ఎన్నికలుజరగనున్నాయి. అయితే.. ఎన్నికలను ముందస్తు గానే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అలానే ఉత్తరాఖండ్ సహా.. గోవాలోనూ ఎన్నికలు ఉన్న నేపథ్యం లో కేంద్ర మంత్రులను ఆయా రాష్ట్రాలకు పరిమితం చేసి.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ముమ్మరమైనట్టు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి.