నేతకు తగ్గ మంత్రులు.. ఎవరంటే ..!
నేతకు తగ్గ మంత్రులు దొరకడం చాలా చాలా అరుదుగా ఉంటుంది. గతంలో వైసీపీలో నూ ఇలానే జరిగింది.;
నేతకు తగ్గ మంత్రులు దొరకడం చాలా చాలా అరుదుగా ఉంటుంది. గతంలో వైసీపీలో నూ ఇలానే జరిగింది. ఒకరిద్దరు తప్ప.. జగన్ మనసు తెలుసుకుని ముందుకు సాగిన నాయకులు లేరు. దీంతో సీఎం ఉద్దే శం.. ఆయన వ్యూహాలను అర్ధం చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని జగన్ అప్పట్లో పలుమార్లు చెప్పుకొ చ్చారు. అయితే.. ఇప్పుడు కూడా ఇలాంటి మంత్రులు ఉన్నారు. అయితే.. మెజారిటీ మంత్రులు మాత్రం నేతలకు తగిన విధంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.
టీడీపీని తీసుకుంటే.. అధినేత చంద్రబాబు వ్యూహానికి తగిన విధంగా మెజారిటీ మంత్రులు అడుగులు వేస్తున్నారు. చాలా మంది గతంలో ఇబ్బందులు పడి.. ప్రజల నాడిని తెలుసుకున్నవారే కావడం.. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లోనే ఉన్న వారు కావడంతో నాయకులు.. తర్వాత కాలంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టాక.. చంద్రబాబు మనసెరిగి పనులు చేస్తున్నారు. వీరిలో అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ చాలా ముందున్నారు.
అందునా.. కీలకమైన బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో వారు చంద్రబాబుకు అవకాశం ఇవ్వకుండా.. వారి వారి శాఖల్లో జోక్యం చేసుకోకుండా కూడా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్ శాకలు ఎప్పుడూ.. ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటాయి. రెవెన్యూలో రిజిస్ట్రేషన్ ధరలు పెంచినా.. ప్రతినెలా వచ్చే విద్యుత్ చార్జీలు పెంచినా.. ఇబ్బందే. ఈ ఇబ్బందులు తట్టుకుని.. సీఎం చంద్రబాబుకు మాట రాకుండా.. ముందు జాగ్రత్తలు తీసుకుని సాగుతున్న ఈ ఇద్దరు మంత్రులు నేతకు తగ్గ మంత్రులుగా ఉన్నారు.
ఇక, జనసేన విషయానికి వస్తే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రు లుగా ఉన్నారు. వీరు కూడా.. డిప్యూటీ సీఎం మనసెరిగి మసులుకుంటుండడం గమనార్హం. మంత్రి కందుల దుర్గేష్ అయితే.. తన పర్యాటక శాఖను కేవలం అలంకార ప్రాయంగా కాకుండా.. పనిమంతమైన శాఖగా రూపుదిద్దారు. వాస్తవానికి పర్యాటక శాఖ అంటే.. మంత్రులు పనిచేయరు. ఇదేదో పనిష్మెంట్ అనుకుంటారు. కానీ, కందుల ఈ మాటను చెరిపేశారు. ఇక, మంత్రి నాదెండ్ల అయితే.. నిరంతరం పౌర సరఫరాల శాఖపైనే దృష్టి పెట్టి.. పవన్ మనసెరిగి ముందుకు సాగుతున్నారు.