• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విమానం ఇంజిన్‌ లో పడి...

విమానం ఇంజిన్‌ లో పడి వ్యక్తి మృతి... ఆత్మహత్యా?

| ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్‌ లో బాధిత ప్రయాణీకులు, సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి, వారికి మానసిక సహాయాన్ని అందించడానికి తాము ప్రతిదీ చేస్తున్నామని తెలిపింది.

By - Tupaki Desk
Update: 2025-07-08 17:04 GMT

ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలకు సంబంధించిన, సాంకేతిక లోపాల కారణంగా రద్దవుతున్న విమానాలకు సంబంధించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా భద్రతా సిబ్బంది కళ్లు గప్పి నేరుగా విమానం పార్కింగ్ జోన్ కు వెళ్లిన ఓ వ్యక్తి.. విమానం ఇంజిన్ లో పడి మృతి చెందిన ఘటన తాజాగా జరిగింది.

అవును... భద్రతా సిబ్బంది కళ్లు గప్పిన ఓ వ్యక్తి విమానాశ్రయంలోని రన్‌ వేపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అక్కడున్న విమానం ఇంజిన్‌ లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్‌ బెర్గామో విమానాశ్రయంలో తాజాగా చోటు చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్యా ప్రయత్నమా.. లేక మరో కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువకుడు విమానాశ్రయ పరిసరాల్లోకి అనుమానాస్పదంగా ప్రవేశించాడు. తన వాహనాన్ని ఎయిర్‌ పోర్టు బయట ఉంచేసి, భద్రతా సిబ్బంది కళ్లు గప్పాడు! నేరుగా విమానం పార్కింగ్‌ జోన్‌ కు వెళ్లే ఎవర్జెన్సీ ద్వారాన్ని బలవంతంగా ఓపెన్ చేశాడు. అనంతరం రన్‌ వే వైపు పరుగు తీశాడు.

ఈ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్‌ బస్ సమీపంలోకి వెళ్లేసరికి.. ఇంజిన్‌ వేగానికి అందులో కూరుకుపోయయాడు. ప్రాణాలు కోల్పోయాడు. దీంతో... అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని, ఇంజిన్‌ ను ఆపేసి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో... కొన్ని గంటలపాటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అయితే.. ఇది ఆత్మహత్యా ప్రయత్నమా.. లేక, మరేదైనా కారణం ఉందా.. అసలు ఇంత కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని దాటుకుని ఎలా ప్రయత్నించాడు.. ఈ ప్రయత్నం వెనుక మరేదైనా లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఎయిర్ పోర్ట్ లో ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ ఘటనపై వోలోటియా స్పందించి. ఈ ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 154 మంది ప్రయాణికులు ఉన్నారని, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారని ధృవీకరించింది. ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్‌ లో బాధిత ప్రయాణీకులు, సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి, వారికి మానసిక సహాయాన్ని అందించడానికి తాము ప్రతిదీ చేస్తున్నామని తెలిపింది.

We regret to confirm flight V73511 from BGY-OVD was involved in an incident at Milan-Bergamo Airport at 10:35h. One person not onboard and not affiliated with the company was seriously injured. All 154 passengers and 6 crew are safe. A new flight is scheduled for 15:55.

— Volotea (@volotea) July 8, 2025
Tags:    
  • MilanAirport 
  • JetEngineAccident 
  • BergamoAirport 
  • Volotea 
  • AviationNews 
  • AirportSecurity 
  • PlaneIncident 
  • TravelAlert 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS