మెస్సీ విందుకు మెనూ ఇదే
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తైంది. నగరంలో గడిపిన సమయం తక్కువే అయినా.. ఏళ్ల కొద్దీ గుర్తుండిపోయే గురుతుల్ని నగరవాసులకు మిగల్చాడు.;
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తైంది. నగరంలో గడిపిన సమయం తక్కువే అయినా.. ఏళ్ల కొద్దీ గుర్తుండిపోయే గురుతుల్ని నగరవాసులకు మిగల్చాడు. అదే సమయంలో పలు మెమరీస్ ను తన వెంట తీసుకెళ్లాడు. అతడి పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. చేసిన ఏర్పాట్లు అతడ్ని ఆకట్టుకున్నట్లుగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అతడి పర్యటన సాగింది.
శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన మెస్సీ పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలస్ కు చేరుకోవటం..అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావటం.. అనంతరం స్టేడియంకు వెళ్లటం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన అసాంతం ఉత్సాహాంగా ఉన్న మెస్సీకి హైదరాబాదీ రుచులను పరిచయం చేశారు. ఉప్పల్ స్టేడియంలో తేనీటి విందు సందర్భంగా అతడికి సర్వ్ చేసిన విందు మెనూ చూస్తే.. పక్కా హైదరాబాద్ రుచులు కనిపించకమానదు.
ఇరానీ చాయ్.. వైల్డ్ బెర్రీ కప్ కేక్.. పేస్ట్రీలు.. ఖుబానీ కా మీఠా.. కుకీలు.. ఉస్మానియా బిస్కెట్లు.. కాఫీ.. చాకొలెట్ మిల్క్ షేక్.. పుచ్చకాయ రసం అందుబాటులో ఉంచినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విందులోనూ హైదరాబాద్ మార్క్ ఉండేలా మెనూను సిద్ధం చేయటం గమనార్హం. ఆలూ టిక్కీ.. వడ.. పుదీనా చట్నీ.. కీరదోస క్్రీమ్ చీజ్ శాండ్ విచ.. ఆలూ సమోసా.. చికెన్ శాండ్ విచ్.. టొమాటో బ్రెడ్.. మటన్ లుఖ్మీ.. ఫిష్.. చికెన్ పకోడా తదితర వంటకాల్్ని సిద్ధం చేశారు. వీటిల్లో కొన్నింటిని మెస్సీ.. అతని సహచర క్రీడాకారులు టేస్ట్ చేశారని చెబుతున్నారు. హైదరాబాద్ రుచులు మెస్సీని ఆకట్టుకున్నట్లుగా చెబుతున్నారు.