కాపులు హ్యాపీ.. చంద్ర‌బాబుకు జై!

ఈ క్ర మంలో వారు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్న ఓ కీల‌క అంశానికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు సంచ‌ల న నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-08-22 06:01 GMT

ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం కీల‌క ఓటు బ్యాంకుగా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వీరంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి.. కూట‌మి పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. పిఠాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తొలి విజ‌యం అందించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. కాపులు కూట‌మికే మొగ్గు చూపారు. ఈ క్ర మంలో వారు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్న ఓ కీల‌క అంశానికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు సంచ‌ల న నిర్ణయం తీసుకున్నారు.

కాపు సామాజిక వ‌ర్గానికి మంచి గుర్తింపు తెచ్చిన వారిలో వివాద ర‌హితులు ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన మండ‌లి వెంక‌ట కృష్ణారావు. కేంద్రంలో మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన నాయ‌కుడిగా కూడా ఆయ‌న ఎదిగారు. వివాదాల‌కు దూరంగా ఉంటూ.. కాపు సంక్షేమానికి కూడా కృషి చేశారు. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని అవ‌నిగ‌డ్డ‌, బండారు లంక‌, ఏలూరు ప్రాంతాల్లో కాపు విద్యార్థుల కోసం భ‌వ‌న్‌లు నిర్మించారు. వారి విద్య‌ను కూడా ప్రోత్స‌హించారు.

ఇలా.. కాపుల్లో త‌ల‌మానికంగా ఎదిగిన వెంక‌ట కృష్ణారావు పేరును సార్థ‌కం చేసేలా.. ఏదైనా గుర్తింపు ఇవ్వా ల‌న్న‌ది కాపు సామాజిక వ‌ర్గంలో ఎప్ప‌టి నుంచో ఉన్న డిమాండ్‌. దీనిని ఇప్పుడు సాకారం చేస్తూ.. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో గురువారం భేటీ అయిన మంత్రి వ‌ర్గం.. తెలుగు అధికార భాషా సంఘానికి ఆయ‌న పేరును పెడుతూ.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌, నుంచి `మండ‌లి వెంక‌ట కృష్ణారావు.. తెలుగు అధికార భాషా సంఘం` పేరుతో దీనిని వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ఇక‌, వెంక‌ట‌కృష్ణారావు వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే.. ఆయ‌న తెలుగులో ప‌లు ర‌చ‌న‌లు కూడా చేశారు. కాశీ నాథుని నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో న‌డిచిన `ఆంధ‌ప‌త్రిక‌`లో వ్యాసాలు రాశారు. ఇలా.. ఆయ‌న‌కు తెలుగుతో అనుబంధం ఎక్కువ‌. అంతేకాదు.. సొంతగా క‌థ‌లు, క‌విత‌లు కూడా రాశారు. స్వాతంత్య్రోద్య‌మ స‌మ‌యంలో జ‌నాల‌ను జాగృతం చేస్తూ.. ఆయ‌న రాసిన ర‌చ‌న‌లు ఎంతో ప్ర‌భావితం చూపాయి. ప్ర‌స్తుతం ఆయ‌న కుమారుడు మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా.. తెలుగు ప‌ట్ల వెంక‌ట కృష్ణారావు చేసిన కృషిని గుర్తిస్తూ..కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న పేరును తెలుగు అధికార భాషా సంఘానికి పెట్టడం ప‌ట్ల కాపులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు

Tags:    

Similar News