భార్య ఇంటి ముందు సంకెళ్లతో భర్త టీ స్టాల్.. వైరల్ ట్విస్ట్ ఏమిటంటే..?

ఇటీవల కాలంలో 498ఏ సెక్షన్ పలు సందర్భాల్లో దుర్వినియోగం అవుతుందనే చర్చ బలంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-06-14 13:30 GMT
భార్య ఇంటి ముందు సంకెళ్లతో భర్త టీ స్టాల్.. వైరల్  ట్విస్ట్  ఏమిటంటే..?

ఇటీవల కాలంలో 498ఏ సెక్షన్ పలు సందర్భాల్లో దుర్వినియోగం అవుతుందనే చర్చ బలంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎవరి మేలు కోరి ఈ సెక్షన్ పుట్టిందో, వారే దీన్ని దుర్వినియోగపరుస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! అలా అని అన్ని కేసులూ అలాంటివని చెప్పే ప్రసక్తే లేదు! ఈ క్రమంలో తాజాగా ఈ సెక్షన్ తో కేసులో ఉన్న ఓ వ్యక్తి చేసిన వినూత్న పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


అవును... భార్య తనపై పెట్టిన భార్య తనపై పెట్టిన కేసుకు నిరసనగా అత్తారింటి ముందు టీకొట్టు పెట్టి, చేతులకు బేడీలు వేసుకొని టీ అమ్ముతున్న ఓ భర్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఆ టీ షాపు పేరు తనపై పెట్టిన సెక్షన్ 498ఏ వచ్చేలా... "498 టీ కేఫ్" అని పెట్టడం గమనార్హం. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్‌ కు చెందిన కృష్ణ కుమార్ థాకడ్ అనే వ్యక్తికి మీనాక్షి అనే యువతితో 2018లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకు ఈ దంపతులు తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఇది దినదినాభివృద్ధి చెందడంతో వీరు చుట్టుపక్కల ఉన్న మహిళలకు కూడా ఉపాధి కల్పించారు. దీంతో వీరికి స్థానికంగా మంచి గుర్తింపు వచ్చింది!

ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని కృష్ణకుమార్ తెలిపారు. అనంతరం ఆమె కొన్ని నెలల తర్వాత తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వరకట్న వేధింపుల సెక్షన్ 498ఏ, సెక్షన్ 125 కింద కేసులు పెట్టిందని కృష్ణ కుమార్ చెబుతున్నారు! ఆ తప్పుడు కేసుల వల్ల తన జీవితమంతా నాశనమైందని ఆరోపిస్తున్నారు.

తాను మూడేళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని.. అయినప్పటికీ న్యాయం జరగడం లేదని తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నాడు! ఈ క్రమంలోనే తనకు అన్యాయం చేసిన భార్యకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్న కృష్ణకుమార్... అనపై పెట్టిన కేసు సెక్షన్ కేసుకు నిరసనగా అత్తారింటి ముందు టీ కొట్టును ప్రారంభించాడు. ఆ కొట్టుకు వినూత్నమైన పేరు పెట్టాడు.

ఇందులో భాగంగా... తనపై పెట్టిన కేసు సెక్షన్ పేరుతోనే టీ కొట్టు ప్రారంభించాడు. ఇదే సమయంలో తాను పడుతున్న మానసిక, శారీరాక వేదనకు గుర్తుగా చేతులకు బేడీలు వేసుకొని టీ అమ్మడం ప్రారంభించాడు. ఈ సమయంలో “తనకు న్యాయం జరిగే వరకూ ఈ టీ మరుగుతూనే ఉంటుంది” అని.. “సెక్షన్ 125 కింద ఎంత సొమ్ము ఇవాల్సి వస్తుందో చాయ్ తాగుతూ చర్చించుకుందాం రండి” అంటూ కొన్ని నినాదాలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశాడు.

దీనిపై స్పందించిన అతని భార్య మాత్రం.. తన భర్త భూమి కొనుగోలు చేయడానికి తన తండ్రిని డబ్బు అడిగాడని.. దానికి తన తండ్రి నిరాకరించడంతో తనను వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. అందువల్లే తాను పుట్టింటికి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది! అందువల్ల.. తాను విడాకులకు సిద్ధంగా ఉన్నానని, అయితే.. భర్త తన తండ్రి నుంచి తీసుకున్న సొమ్మంతా తిరిగి ఇవ్వాలని ఆమె తెలిపింది.

ఆ కేసు సంగతి అలా ఉంటే... ప్రస్తుతం "498 టీ కేఫ్" మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పోస్టుల కింద కామెంట్ సెక్షన్ లో ఎవరి అభిప్రాయలు వారు, ఎవరి అనుభవాలు వారు పంచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు!

Tags:    

Similar News