మమత కోరుకున్నదే గవర్నర్ ఇచ్చారు !

పశ్చిమ బెంగాల్ కి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తిరుగులేని విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకున్న మమతా బెనర్జీ చివరికి బర్తరఫ్ అయ్యారు.;

Update: 2026-05-07 18:02 GMT

పశ్చిమ బెంగాల్ కి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తిరుగులేని విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకున్న మమతా బెనర్జీ చివరికి బర్తరఫ్ అయ్యారు. ఆమె ప్రభుత్వాన్ని బెంగాల్ గవర్నర్ రవి డిసిమిస్ చేశారు. మే 7వ తేదీతో గడువు తీరిపోవడంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కీలకమైన రాజ్యాంగ పరమైన నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో ఏర్పాటు చేసేందుకు వీలుగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. దేశ రాజకీయాల్లో అతి ముఖ్య నాయకురాలిగా ప్రధాని రేసులో కీలకమైన పోటీదారుగా ఉన్న మమతా బెనర్జీ ఈ విధంగా చివరికి బెంగాల్ లో ఓటమి పాలు అయి బర్తరఫ్ అయ్యారు. అఫ్ కోర్స్ ఆమె ఇది కోరుకున్నదే అని అంటున్నారు.

రాజ్యంగం ప్రకారమే :

పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సన్నాహాల నడుమ రాష్ట్ర శాసనసభను లాంఛనంగా రద్దు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి, గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ఒక ప్రభుత్వం పదవీ కాలం అయిదేళ్ళు ఉంటుంది. ఆ సర్కార్ ప్రమాణం చేసిన నాటి నుంచి అయిదేళ్ళ పాటు గడువు ఉంటుంది. ఈ లోగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎన్నికలు పెడతారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు పాత ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగం చెబుతున్న అతి ముఖ్యమైన విషయం.

మమత కోరినట్లుగా :

అప్పటిదాకా ఉన్న వారే మరోసారి అధికారం అందుకున్నా పాత ప్రభుత్వం గడువు తీరినందువల్ల రాజీనామా సమర్పించాల్సిందే. ఇక ఓడిన వారు ఎటూ రాజీనామా చేస్తారు. తమిళనాడులో స్టాలిన్, కేరళంలో పినరయి విజయం ఆ విధంగానే చేశారు. కానీ మమతా బెనర్జీ మాత్రం మొండికేశారు. తాను ఓడి పోలేదని అన్నారు. అందుకే రాజీనామా చేయను రాజ్ భవన్ కి వెళ్ళి గవర్నర్ ని కలవను అన్నారు. దాంతో ప్రభుత్వం గడువు తీరే వరకూ చూసిన గవర్నర్ మే 7న కీలక నిర్ణయం తీసుకుని బర్తరఫ్ చేశారు.మమత సైతం తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసుకోవాలని రాష్ట్రపతి పాలన పెట్టుకోవాలని కోరడం జరిగింది అని అంటున్నారు. అయితే రాజ్యంగపరమైన చర్యగానే దీనిని చూస్తున్నారు.

9న బీజేపీ ప్రభుత్వం :

ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 8న కోల్‌కతాకు చేరుకుంటారు. ఆయన కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ శాసనసభాపక్ష నాయకుడిని ఎంపిక చేస్తారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రితో పాటు మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవం మే 9న శనివారం జరగనుంది.

ఇదిలా ఉండగా కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం అవసరమైన పరిపాలనాపరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని చెబుతున్నారు.

Tags:    

Similar News