10 గ్యారెంటీలు.. యువ‌త‌కు నెల‌కు 1500: దీదీ భారీ హామీలు

కోల్‌క‌తాలో జ‌రిగిన పార్టీ కార్య‌క్ర‌మంలో త‌న మేన‌ల్లుడు, డైమండ్ హార్బ‌ర్ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీతో క‌లిసి.. మ‌మ‌త ఈ మ్యానిఫెస్టోను విడుద‌ల చేశారు.;

Update: 2026-03-20 17:26 GMT

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు.. అధికార పార్టీ ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించాయి. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. అధికార కూసాలు క‌దిలిపోయే ప్ర‌మాదం ఉంద‌న్న స‌ర్వే హెచ్చ‌రిక‌లు.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని క‌ల‌వ‌ర పెడుతున్నాయి. దీంతో అన్ని వ‌ర్గాల‌ను.. చేరువ చేసుకునేందుకు, అంద‌రినీ మ‌చ్చిక చేసుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా 10 కీల‌క గ్యారెంటీల‌తో కూడిన భారీ మ్యానిఫెస్టోను ఆమె విడుద‌ల చేశారు.

కోల్‌క‌తాలో జ‌రిగిన పార్టీ కార్య‌క్ర‌మంలో త‌న మేన‌ల్లుడు, డైమండ్ హార్బ‌ర్ ఎంపీ అభిషేక్ బెన‌ర్జీతో క‌లిసి.. మ‌మ‌త ఈ మ్యానిఫెస్టోను విడుద‌ల చేశారు. అన్ని వ‌ర్గాల‌ను ఆద‌రించ‌డ‌మే త‌న‌కు తెలిసిన పాల‌న అని మ‌మ‌త పేర్కొన్నారు. త‌న జీవితాన్ని ప్ర‌జ‌ల సేవ‌కు అంకింత చేశానంటూ.. త‌న వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన విష‌యాన్ని ఆమె ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ``ఇంత‌క‌న్నా.. వారు చేయ‌గ‌ల‌రా?`` అంటూ బీజేపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి మ‌మ‌త నిల‌దీశారు. త‌న‌కు మ‌తం, కులం అంటూ ఏమీలేవ‌న్నారు. మాన‌వ‌త్వ‌మే మ‌త‌మ‌ని.. అన్ని వ‌ర్గాల వారినీ స‌మానంగా చూడ‌డ‌మే కుల‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఇవీ.. 10 గ్యారెంటీలు..

1) మ‌హిళ‌లు అంద‌రికీ నెల‌కు రూ.1500 ఆర్థిక సాయం. అదే ఎస్సీ, ఎస్టీలైతే.. 1700 సాయం.

2) నిరుద్యోగులకు ఉద్యోగం వ‌చ్చే వర‌కు వ‌య‌సుతో నిమిత్తం లేకుండా నెల‌కు రూ.1500 భృతి.

3) మొబైల్ హెల్త్ వ్యాన్లు. ఇంటి వ‌ద్ద‌కే నాణ్య‌మైన వైద్యం.

4) ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఆధునీక‌ర‌ణ‌. ఈ-లెర్నింగ్ స‌దుపాయం.

5) రాష్ట్రంలో 7 కొత్త జిల్లాల ఏర్పాటు.

6) 30 వేల కోట్ల రూపాయ‌ల‌తో రైతుల‌కు ప్ర‌త్యేకంగా వ్య‌వ‌సాయ బ‌డ్జెట్‌.

7) ప్రతి కుటుంబానికీ శాశ్వత ఇంటి నిర్మాణం.

8) ప్రతి ఇంటికీ మిన‌ర‌ల్ వాట‌ర్ పంపిణీ.

9) రాష్ట్రంలోని వృద్ధులందరికీ పింఛ‌ను.

10) బెంగాల్‌ను పెట్టుబడులు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం.

Tags:    

Similar News