మూడో గర్భానికి సెలవులు ఇవ్వాల్సిందే.. మద్రాసు హైకోర్టు క్లారిటీ

ఒక మహిళా ఉద్యోగి మూడో ప్రసవానికి సెలవులకు సంబంధించిన అంశాలపై మద్రాసు హైకోర్టు పూర్తి స్పష్టతను ఇచ్చేసింది.;

Update: 2025-09-06 08:34 GMT

ఒక మహిళా ఉద్యోగి మూడో ప్రసవానికి సెలవులకు సంబంధించిన అంశాలపై మద్రాసు హైకోర్టు పూర్తి స్పష్టతను ఇచ్చేసింది. ఆమె పని చేస్తున్న సంస్థ.. సదరు ఉద్యోగినికి ప్రసూతి సెలవుల్ని ఇచ్చేందుకు నో చెప్పిన ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనలు విన్న అనంతరం.. సదరు సంస్థ తప్పనిసరిగా ప్రసూతి సెలవుల్ని ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

మూడోసారి గర్భం దాల్చినా ప్రసూతి సెలవులకు మహిళా ఉద్యోగి అర్హురాలేనని స్పష్టం చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సదరు మహిళా ఉద్యోగి పని చేసేది మరెక్కడో కాదు. తమిళనాడులోని ఉలుందుర్ పేట్ మున్సిఫ్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఆమె పేరు రంజిత. ఆమె మూడోసారి గర్భం దాల్చిన వేళ.. ఆమె పని చేస్తున్న కోర్టులో ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేయగా.. అక్కడి న్యాయమూర్తి ఆమెకు సెలవులు ఇచ్చేందుకు నో చెప్పారు.

దీంతో.. ప్రసూతి సెలవుల విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు యరంజిత హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్, జస్టిస్ హేమత్ చందన్ గౌదర్ ధర్మాసనం విచారణ జరిపింది. విధుల్లో చేరటానికి ముందే ఇద్దరు పిల్లలు ఉండటం.. విధుల్లో చేరిన తర్వాత మూడో గర్భం వచ్చిన నేపథ్యంలో ఆమెకు సెలవులు ఇవ్వాల్సి ఉందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తరహా ఉదంతంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పేర్కొన్నారు. దీంతో.. సదరు మహిళా ఉద్యోగికి చట్టప్రకారం ప్రసూతి సెలవులు ఇవ్వాలంటూ ఉలుందుర్ పేట కోర్టు లోని మున్సిఫ్ కోర్టు జడ్జిని ఆదేశించింది.

Tags:    

Similar News