• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రెడ్ బుక్...

రెడ్ బుక్ స్టార్ట్...ఎండింగ్ అంటూ లోకేష్ సంచలనం

| రెడ్ బుక్ లో తప్పు చేసిన వారి పేర్లు అన్నీ రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చాక లెక్క సరిచేస్తామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2025-01-20 16:30 GMT

రెడ్ బుక్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త పద ప్రయోగం చేసిన ఘనత అచ్చంగా నారా లోకేష్ దే ఆయన యువగళం పేరుతో సాగించిన పాదయాత్రలో ప్రతీ చోటా రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రెడ్ బుక్ లో తప్పు చేసిన వారి పేర్లు అన్నీ రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చాక లెక్క సరిచేస్తామని కూడా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చారు.

ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటోంది వైసీపీ. అయితే రెడ్ బుక్ ఇంకా పక్కాగా అమలు కావాలని టీడీపీ అభిమానులు క్యాడర్ కోరుకుంటున్నారు. మరి రెడ్ బుక్ ఆవిష్కర్త టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీని మీద ఏమి చెబుతున్నారు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్.

జ్యూరిచ్‌లో జరిగిన తెలుగు ప్రవాసులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ, ఒక తమ్ముడు రెడ్ బుక్ గురించి తన వద్ద ప్రస్తావించారని అన్నారు రెడ్ బుక్ విషయం ఇంతలా పాపులర్ కావడం పట్ల ఆయన ఒకింత ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు తాను పాదయాత్రలో రెడ్ బుక్ గురించి మాట్లాడినపుడు కూడా ఇంతలా చర్చకు రాలేదని అన్నారు

అయితే అధికారంలోకి వచ్చాం కదా అని కక్ష తీర్చుకునే ప్రభుత్వం మాది కాదని ఆయన స్పష్టం చేశారు. రెడ్ బుక్ స్టార్ట్ అయింది అని ఆయన అక్కడ సభికులతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఏ విషయం అయినా ఎస్టాబ్లిష్ చేయాలి కదా అని కూడా అన్నారు. దీనిని అండర్ లైన్ చేసుకోవాలని సూచించారు

రెడ్ బుక్ విషయంలో ఎలాంటి డౌట్లూ ఉండనక్కరలేదని స్పష్టం చేశారు. తాను పాదయాత్రలో చెప్పిందేటి అన్నది కూడా వివరించారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లఘించి ప్రజలను కార్యకర్తలను బాధపెట్టారో వాళ్ళను వదిలేది లేదు అని క్లారిటీగా చెప్పామని అన్నారు

అందువల్ల ఎలాంటి సందేహమూ అవసరం లేదు, మీరు రిలాక్స్ గా ఉండండి అన్నీ చూస్తారు అని లోకేష్ చెప్పారు. రెడ్ బుక్ పని ఆల్రెడీ మొదలైంది. దానిని పూర్తి చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని లోకేష్ కీలక కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఇదే స్పీచ్ లో లోకేష్ చంద్రబాబు గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.బాబుతో పాటుగా పనిచేయడం అంటే కష్టమే అంటూ మాట్లాడారు. ఆయనలా పోటీ పడలేమని కూడా లోకేష్ చెప్పడం విశేషం. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూడా లోకేష్ ఆయన వివరించారు. అవును అది నిజమే అని అంతా ఒప్పుకునే మాట. ఆయన వయసు ఏడున్నర పదులు. అయినా ఆయన ఎనర్జీ ఎవరికీ లేదు, రాదు. ఆఖరుకి ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ అయినా అదే మాట అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి పనిచేయడం అంటే చాలా కష్టమని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Chandrababu 
  • Apcm 
  • Pawankalyan 
  • Deputycm 
  • Naralokesh 
  • Comments 
  • Redbook 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS