భగీరథ్‌పై కేటీఆర్‌కు డౌటానుమానం.. విషయం ఏంటంటే!
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్.. ప్రస్తుతం విచారణ ఖైదీగా చర్ల పల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్.. ప్రస్తుతం విచారణ ఖైదీగా చర్ల పల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషిన్ వేసినా.. ఈలోగానే పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్టు చెప్పారు. దీంతో ముందస్తు బెయిల్‌ను వెనక్కితీసుకున్న భగీరథ్.. రెగ్యురల్ బెయిల్ కోసం హైకోర్టులో మరోపిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ముఖ్య నాయకుడు.. కేటీఆర్ తాజాగా భగీరథ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదేసమయంలో కొన్ని డౌట్లు కూడా వ్యక్తం చేశారు.
భగీరథ్‌ను కాపాడేందుకు.. బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని కేటీఆర్ ఆరోపించారు. కేసు నమోదైన తర్వాత.. 9 రోజలు పాటు.. భగీరథ్‌ను దాచి ఉంచారని.. ఆయనను ఆ సమయంలో ఎవరి దగ్గర.. దాచి పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఎక్కడ దాచారన్నది తమకు అనుమానం ఉందన్నారు. సామాన్యులకు ఒక రూలు.. అధికారంలో ఉన్నవారికి మరో రూలు వర్తిస్తుందా? అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. 9 రోజలు పాటు పోక్సో కేసు నిందితుడిని దాచారంటే.. అది అధికార దుర్వినియోగం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
రాజీనామాకు సిద్ధం..
మరోవైపు.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్.. 2034 వరకు ఆయనే సీఎంగా ఉంటారని అంటున్న నేపథ్యంలో మరోసారి ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా? అని నిలదీశారు. ఒకవేళ సీఎంలో ఆ ధైర్యమే ఉంటే.. తాము కూడా రాజీనామా చేస్తామని.. ఎన్నికలకు వెళ్దామని వ్యాఖ్యానించారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగి పోతున్నామని చెబుతున్నట్టు తెలిపారు.
ఇలాంటి సమయంలో మరోసారి తమ ప్రభుత్వమే వస్తుందని చెబుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. అంత ధైర్యం ఉన్న నాయకుడివే అయితే.. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తారా? అని ప్రశ్నించారు. సగం మంది మంత్రులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోడకల పట్ల వారు కూడా విసిగిపోయారని చెప్పారు. ఇక్కడ నుంచి సంచులను ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.