వయసు అయిపోయింది.. నడవలేకపోతున్నా.. ధోని కామెంట్స్ వైరల్..
రైల్వే స్టేషన్‌లో టికెట్లు కలెక్ట్ చేసుకునే ఒక సాదాసీదా యువకుడు.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఆరేళ్లయినా.. జుట్టు నెరిసిపోయినా.. మన ‘తలా’ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తాజాగా 45వ పుట్టినరోజు జరుపుకుని.. లండన్ ముచ్చట్లు ముగించుకుని, భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ చూసేందుకు ట్రెంట్ బ్రిడ్జ్ వెళ్లిన ఎంఎస్ ధోని.. అక్కడ నిర్వాహకులతో.. ఫ్యాన్స్‌తో వేసిన జోకులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. "ఇప్పుడు నాకు వయసు అయిపోయింది బాసూ... గడ్డం చూశారా పూర్తిగా తెల్లబడింది... నడవడం కూడా కొంచెం కష్టంగానే మారింది" అంటూ ధోని తనదైన శైలిలో సెటైర్లు వేశాడు.
ఆయన ఏదో సరదాగా అంటే.. మన నెటిజన్లు, డైహార్డ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అప్పుడే సెంటిమెంట్ సీన్లు మొదలుపెట్టేశారు. "అయ్యో.. కాలం ఎంత వేగంగా మారిపోయింది.. ఒకప్పుడు చిరుతపులిలా పరిగెత్తి స్టంపింగ్స్ చేసిన మా ‘కెప్టెన్ కూల్’ నోట ఇలాంటి మాటలా?" అంటూ ఎమోషనల్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ధోని వేసిన పంచ్‌ను కూడా ఒక ట్రాజెడీ సీన్‌లా మార్చేయడం మనోళ్లకే చెల్లింది.
ఐపీఎల్ 2026: బెంచ్‌కే పరిమితమా.. రిటైర్మెంటా?
మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. దీంతో క్రికెట్ పండితులు, ట్విట్టర్ విశ్లేషకులు మళ్లీ డ్యూటీ ఎక్కేశారు. వచ్చే సీజన్‌లో ధోని ఆడతాడా? లేక సైలెంట్‌గా ‘ప్రాక్టీస్’ ముగించి పూర్తిగా తప్పుకుంటాడా? సీఎస్‌కే మెంటార్‌గా సెటిల్ అయిపోతాడా? ఇలా రకరకాల ప్రశ్నలతో సోషల్ మీడియాను తిరగరాస్తున్నారు. అయితే ఎప్పటిలాగే మన కూల్ కెప్టెన్ మాత్రం ‘నో కామెంట్’ అంటూ సైలెంట్‌గా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆ దేవుడికి, ధోనికి మాత్రమే తెలుసు!
టికెట్ కలెక్టర్ టు వరల్డ్ కప్ విన్నర్: ఓ లుక్కేద్దాం
రైల్వే స్టేషన్‌లో టికెట్లు కలెక్ట్ చేసుకునే ఒక సాదాసీదా యువకుడు.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. 2004లో ఎంట్రీ ఇచ్చిన ఈ రాంచీ బాయ్.. తన హెయిర్ స్టైల్‌తోనే కాదు.. హెలికాప్టర్ షాట్లతోనూ ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేశాడు. ధోని ఖాతాలో ఉన్న ఐసీసీ ట్రోఫీల రికార్డును అందుకోవడం ఇప్పటికైనా.. ఎప్పటికైనా ఏ భారత కెప్టెన్‌కైనా ‘నభూతో నభవిష్యతి’ అనే చెప్పాలి.
నంబర్ల వేటలో ‘నెంబర్ 7’
గణాంకాల పరంగా చూస్తే ధోని కెరీర్ ఒక విరాట్ స్వరూపం. 538 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఏకంగా 17,266 పరుగులు సాధించాడు. ఇక వికెట్ల వెనుక నిలబడి 829 డిస్మిసల్స్‌తో బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. వన్డేల్లో 10,773 పరుగులు 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు , టెస్టుల్లో 4,876 పరుగులు, టీ20ల్లో 1,617 పరుగులతో మూడు ఫార్మాట్లలోనూ తనేంటో నిరూపించుకున్నాడు.
చివరగా చెప్పేదేంటంటే.. ధోని "నడవలేకపోతున్నా" అని సరదాగా అన్నా.. అది ఫ్యాన్స్ గుండెల్లో గట్టిగానే తాకింది. ఆయన మైదానంలో బ్యాట్ పట్టినా పట్టకపోయినా.. ‘కెప్టెన్ కూల్’ బ్రాండ్ వాల్యూ మాత్రం 2026లోనే కాదు.. ఎప్పటికీ తగ్గదనేది జగమెరిగిన సత్యం.