మిస్ తెలుగు.. మిసెస్ తెలుగు.. ఇద్దరూ క్రిష్ణా జిల్లా వారే
ఉమ్మడి ఏపీలోనూ.. విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. రెండు మూడు జిల్లాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అది విద్యలో కావొచ్చు..వ్యాపారంలో కావొచ్చు. ఇతర అంశాల్లో కావొచ్చు.;
ఉమ్మడి ఏపీలోనూ.. విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. రెండు మూడు జిల్లాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అది విద్యలో కావొచ్చు..వ్యాపారంలో కావొచ్చు. ఇతర అంశాల్లో కావొచ్చు. అలాంటి సమ్ థింగ్ స్పెషల్ ఇమేజ్ ఉన్న జిల్లాల్లో ముందు ఉంటుంది ఉమ్మడి క్రిష్ణా జిల్లా. తాజాగా వెలువడిన రెండు వేర్వేరు పోటీల్లో విజేతలు ఈ జిల్లాకు చెందిన వారు కావటం విశేషం. మిస్ అండ్ మిసెస్ తెలుగు అమెరికా పోటీలకు సంబంధించి.. రెండు వేర్వేరు వేదికలపై జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన ఇద్దరు అందగత్తెలు.. ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన వారు కావటం విశేషంగా చెప్పాలి.
నాట్స్ (దక్షిణ అమెరికా తెలుగు సొసైటీ) ఇటీవల నిర్వహించిన మిస్ తెలుగు అమెరికా పోటీల్లో క్రిష్ణా జిల్లాకు చెందిన భవిరిశెట్టి నిహారిక విజేతగా నిలిచారు. అమెరికాలోని న్యూయార్స్ లో లాంగ్ ఐలాండ్ వర్సిటీలో ఎంఎస్ చదువుతున్న నిహారిక ఈ పోటీల్లో విజేతగా నిలిచారు. ఓవైపు ఉన్నత విద్యాభాస్యం చేస్తూనే.. మరోవైపు ఆందాల పోటీల్లో తన సత్తా చాటిన నిహారికను పలువురు అభినందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మరో పోటీలోనూ క్రిష్ణా జిల్లాకు చెందిన మహిళే విజేతగా నిలవటం.. అది కూడా అందాల పోటీనే కావటం విశేషంగా చెప్పాలి. డల్లాస్ లో జరిగిన మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో క్రిష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గుడివాడకు చెందిన ఆమె బెంగళూరులో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 2013లో ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు.
2014లో చెన్నైకు చెందిన జితేంద్ర కుమార్ తో పెళ్లైన తర్వాత 2017లో భర్తతో కలిసి అమెరికాకువెళ్లిపోయారు. తన ప్రతిభతో సేల్స్ ఫోర్సు కంపెనీలు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నారు. ఓవైపు ఉద్యోగ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తూనే.. మరోవైపు తాజాగా జరిగిన మిసెస్ తెలుగు యూఎస్ఏ పోటీల్లో నిలిచి రెండోస్థానాన్ని సొంతం చేసుకున్నారు. వేలాది మంది ఈ టైటిల్ కు పోటీ పడగా.. తుది జాబితాలో పాతికలో ఒకరిగా నిలిచిన ఆమె.. చివరకు రన్నరప్ గా నిలిచారు.