కొణతాల సత్తాకు కొత్త టెస్ట్ ?

ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు కొణతాల రామక్రిష్ణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

Update: 2026-06-26 03:49 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు కొణతాల రామక్రిష్ణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రెండు మార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా అయిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన కొణతాల రాజకీయం అంతా కాంగ్రెస్ లోనే సాగింది. 1989లో కేవలం 9 ఓట్ల తేడాతో ఆయన అనకాపల్లి నుంచి గెలిచి గిన్నీస్ రికార్డుని క్రియేట్ చేశారు. 1991లో మరోసారి అదే సీటు నుంచి గెలిచారు. ఆయనకు పార్లమెంట్ లోనే వైఎస్సార్ తో పరిచయం ఏర్పడిది. అది ఆయన మరణం దాకా కొనసాగింది. అందుకే 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు కొణతాలకు ఒకే ఒక్కడుగా అయిదేళ్ళ పాటు మంత్రిగా చేసి వైఎస్సార్ ఆయనకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు.

వైసీపీలో స్వల్పకాలం :

ఇక వైఎస్సార్ మరణాంతరం వైసీపీ వైపు కొణతాల వచ్చారు. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీ పునాదుల నుంచి ఉన్న నేత ఆయన. అయితే అతి స్వల్ప కాలం ఆయన వైసీపీలో కొనసాగారు. జగన్ విధానాలతో విభేదించి 2014 ఎన్నికల తరువాత ఆయన దూరం అయ్యారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరినా పోటీ చేయకుండా మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయింది. దాంతో కొణతాల కూడా కొంతకాలం తెర మరుగు కాక తప్పలేదు. అయితే 2024 సంక్రాంతి నుంచి ఆయన రాజకీయ దశ జోరందుకుంది.

అనూహ్యంగా జనసేనలో :

కొణతాలకు అనూహ్యంగా జనసేనలో మంచి స్థానమే దక్కింది. ఎందరో అనకాపల్లి సీటు నుంచి పోటీ చేసేందుకు పోటీ పడుతున్న నేపధ్యంలో కొణతాల మెడలో జనసేన కండువా పడడంతోనే ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆయనను అంతా ఓకే చేశారు. దాంతో మంచి మెజారిటీతో కొణతాల గెలిచి వచ్చారు. మంత్రి పదవి దక్కుతుందని అనుకుంటే తొలి చాన్స్ లో మిస్ అయింది. అయితే మలివిడత చాన్స్ లో మాత్రం గురి తప్పదని ఆయన అనుచరులు గట్టిగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కొణతాలకు జనసేనలో మంచి గౌరవంతో పాటు ఇపుడు కీలకమైన గుర్తింపు కూడా దక్కింది.

జిల్లా బాధ్యతలు :

ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ పరిశీలకుడిగా మొత్తం మంచి చెడ్డలను చూసే అతి ముఖ్యమైన బాధ్యతలను పవన్ ఆయనకు అప్పగించారు. ఇక కొణతాల జనసేన జాయినింగ్స్ కమిటీలో కూడా ఉన్నారు. దాంతో విశాఖ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బరువు బాధ్యతలను ఆయన మీద ఎంతో నమ్మకంతో పవన్ అప్పగించారు అని అంటున్నారు. ఇపుడు కొణతాల అధినాయకత్వం తనకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంది. తనకు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనను పటిష్టం చేయాల్సి ఉంది అని అంటున్నారు.

వైసీపీ నుంచేనా :

కొణతాల వైసీపీలో పనిచేశారు. చాలా మంది నాయకులను కూడా ఆయన ఆ పార్టీలోకి తెచ్చారు.వారిలో ఇపుడు ఎంతో మంది ఉన్నారు. అయితే వైసీపీలో తమకు సరైన ప్రాధాన్యత లేదని భావించే వారు కూడా ఉన్నారు. అసంతృప్తి గళాలు కూడా లోలోపల ఉన్న వారు కూడా కనిపిస్తున్నారు. మౌనంగా ఉంటూ పార్టీకి దూరంగా ఉన్న వారు కనిపిస్తున్నారు. ఇపుడు వీరిని జనసేన వైపు తిప్పుకుని జిల్లాలో జనసేనను బలోపేతం చేయాల్సిన బాధ్యత కొణతాల మీద ఉందని అంటున్నారు. రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉండి కూడా ఏమీ కాకుండా మిగిలిపోయిన నాయకులు అయితే వైసీపీలో ఉన్నారని అంటున్నారు. మరి కొణతాల తన పాత పరిచయాలకు పదును పెట్టి బలమైన నాయకులను జనసేనలోకి తీసుకుని రావడం ద్వారా సత్తా చాటుతారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌమ్యుడిగా వివాద రహితుడిగా రాజకీయ వ్యూహకర్తగా కొణతాలకు పేరుంది. ఇపుడు అదే జనసేనకు కూడా ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News