• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కోమటిరెడ్డి వర్సెస్...

కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి... సలార్ సాంగ్ తో సమాధానం!

| తాజాగా ఆ సాంగ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి... తనతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను జతచేసి సరికొత్తగా క్రియేట్ చేసిన ఒక వీడియో షేర్ చేశారు

By - Tupaki Desk
Update: 2023-12-31 07:33 GMT

కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నట్లు 10ఏళ్ల వనవాసం పూర్తయ్యింది.. ఇక రాజయోగం మొదలైంది అన్నట్లుగా తెలంగాణ ఎన్నికల్లో విజయం అనంతరం కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారుతుంది. టి.కాంగ్రెస్ నేతల్లో ఈ ఐకమత్యమే కదా తాము కోరుకున్నది అంటూ శ్రేణులు ఖుషీగా కామెంట్లు పెడుతున్నాయి.

అవును... రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వీరిద్దరూ రాజకీయంగా ఒకే పార్టీ అయినప్పటికీ గతంలో ఉప్పూ, నిప్పూగా ఉన్న సంఘటనలు ఎన్నో తెరపైకి వచ్చాయి! పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ, బహిరంగంగానూ పలు దఫాలుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే.. అదంతా గతం! ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనసాగుతుండటం జరుగుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ వీరిద్దరి మధ్య పొరపొచ్చులన్నీ రూపుమాసిపోయాయని తెలిపేలా అన్నట్లుగా... ఎక్కడ చూసినా వీరిద్దరూ చాలా అన్నోన్యంగా కనిపిస్తున్నారు! దీంతో ఇరువురు నేతల అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా వెంకటరెడ్డి పోస్ట్ చేసిన వీడియోలో "సలార్" సాంగ్ వినిపిస్తుంది. యంగ్ రెబల్ స్టార్, డైనోసార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం గురించి సాంగ్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో భాగంగా... "వేగమొకడు... త్యాగమొకడు" అంటూ ఈ పాట సాగుతుంది.

తాజాగా ఆ సాంగ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి... తనతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను జతచేసి సరికొత్తగా క్రియేట్ చేసిన ఒక వీడియో షేర్ చేశారు. తద్వారా రేవంత్ రెడ్డితో తనకు విభేదాలు లేవు సరికదా.. బలమైన స్నేహ బంధం ఉందని చెప్పే ప్రయత్నం చేసినట్లున్నారు! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏ ఇద్దరు కాంగ్రెస్ శ్రేణులు కలిసినా వారిమధ్య ఈ వీడియో ప్రస్థావనకు వస్తుందని చెప్పినా అతిశయోక్తి కాదన్నట్లుగా వైరల్ అవుతుంది.

వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.

ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే

ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.

సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే...#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ

— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
Tags:    
  • Komatireddyvenkatreddy 
  • Revanthreddy 
  • Congress 
  • Telanganacm 
  • Komatireddy 
  • Salaarsong 
  • Prabhas 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS