బ్రదర్ ఆఫ్ కోమటిరెడ్డి...సంచలన నిర్ణయమా ?
అయితే సడెన్ గా ఇపుడు కొత్త ప్రచారం ఊపందుకుంది సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆ ప్రచారం సారాంశం ఏమిటి అంటే మరోసారి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారు అని.;
నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల హవా గురించి వేరేగా చెప్పాల్సింది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఉంటారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కి పట్టున్న ప్రాంతం. ఇక్కడ నుంచి ఎందరో దిగ్గజ నేతలు కాంగ్రెస్ నుంచి ఏలారు. వర్తమానంలో చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ చక్రం తిప్పుతున్నారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు నిత్యం వార్తలలో ఉండేవారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు కానీ అప్పట్లో అది అతి పెద్ద సంచలనమైంది.
కాంగ్రెస్ లో చేరినా :
ఇక చూస్తే 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరారు. ఆయన ఈసారి కూడా మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రి కావాలని ఆశ పడ్డారు. అయితే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యారు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వరని సమీకరణలు సరిపోవని తేల్చడంతో ఆయన భారీ నిరాశకు గురి అయ్యారు. ఆనాటి నుంచి ఆయన వార్తలలో నిలుస్తూ తనదైన హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఆయన మాటల వైఖరి చూసిన వారు అధికార పక్షంలో విపక్షం అన్నట్లుగా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి.
పార్టీ మారుతున్నారా :
అయితే సడెన్ గా ఇపుడు కొత్త ప్రచారం ఊపందుకుంది సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆ ప్రచారం సారాంశం ఏమిటి అంటే మరోసారి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారు అని. ఆయన కాంగ్రెస్ లో సంతృప్తిగా లేరని అందుకే పార్టీని వీడుతున్నారు అన్నది వైరల్ గా చేస్తున్న వ్యవహారంగా ఉంది. నిజానికి చూస్తే కాంగ్రెస్ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునే ముందు ఒక భారీ హామీ ఇచ్చిందంట. ఆయనకు మంత్రి పదవి తప్పకుండా ఇస్తమాని కూడా పేర్కొంది. ఇక తనకు హోం మంత్రి కావాలని ఉందని కూడా అప్పట్లో రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పుకున్నారని అంటారు. తీరా చూస్తే ఆయనకు మంత్రి పదవే దక్కలేదు
క్లారిటీ ఇచేసినట్లేనా :
అయితే తాను పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు అని రాజగోపాల్ రెడ్డి ఖండిస్తున్నారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటాను అని ఎక్కడికీ వెళ్ళే ప్రసక్తి లేదని ఆయన అంటున్నారు. తన మీద పనిగట్టుకుని కొందరు చేస్తున్న దుష్ప్రచారం ఇదంతా అని ఆయా అంటున్నారు. తాను ఒకవేళ ఏ నిర్ణయం అయినా తీసుకున్నా అది మీడియాకు చెప్పే చేస్తాను తప్ప తెర చాటున చేయడం అన్నది ఉండదని పక్కా క్లారిటీ ఇస్తున్నారు. ఇదంతా తన మీద జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. తాను కాంగ్రెస్ కి ఎంతో నమ్మకం కలిగిన కార్యకర్తను అన్నారు పార్టీ మారడం అన్న ప్రశ్నే ఉండదని అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేసే స్వభావం తనదని ఆయన అంటున్నారు. మొత్తం మీద చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఎవరు కుట్ర చేస్తున్నారు ఆయన పార్టీ మారుతున్నారు అని ఎవరు ప్రచారంలోకి తెచ్చారు అన్నది చర్చ సాగుతోంది. కోమటిరెడ్డి అయితే తాను కాంగ్రెస్ లోనే ఉంటాను ఇదే సత్యం అని చెబుతున్నారు. సో తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం ఇది ఒక కొత్త చర్చగా సాగుతోంది.