• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కోకాపేట -టమాటా తోటా......

కోకాపేట -టమాటా తోటా... మీమ్స్ వైరల్!

| గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా కోకాపేట భూములకు సంబధించిన చర్చే సాగుతోన్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-08-05 06:42 GMT

గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా కోకాపేట భూములకు సంబధించిన చర్చే సాగుతోన్న సంగతి తెలిసిందే. ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా మధ్యలో కోకాపేట భూముల టాపిక్ ఉండకుండా ఉండే ఛాన్స్ లేదన్నా అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో కోకాపేట భూముల ధరల విషయంలో క్రియేటివిటీకి పనిచేప్పారు మీమర్స్!

అవును... కోకాపేట భూముల వేలంలో ఎకరానికి అత్యధికంగా రూ.100 కోట్ల రేటు పలికిన విషయం తెలిసిందే. అలాగే, మరికొన్ని ప్లాట్లు కూడా అతి భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇలా హైదరాబాద్ శివారులోని కోకాపేట భూములు అంచనాలకు మించి ధర పలుకుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో దీనిపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.

కోకాపేటలో ఒక్క అడుగు భూమున్నా చాలు అంటూ సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతున్నాయి. ఇదే సమయంలో పెళ్లి చేసుకుంటే అక్కడ భూములు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలని కొందరు మీమ్స్ సృష్టిస్తుంటే.. మా తాతకు అక్కడ భూములు ఉన్నట్లు రాత్రి కల వచ్చిందంటూ మరికొందరు వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.

ఇదే సమయంలో... దేశంలో ఇప్పుడు రిచ్చెస్ట్ ప్లేస్ లు రెండే రెండు... వాటిలో ఒకటి కోకాపేట - రెండోది టమాటా తోట అంటూ యతిప్రాసలతో కూడిన మీమ్స్ ఆన్ లైన్ వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా రేట్లు కోండెక్కు కూర్చోగా.. కోకాపేట రేట్లు పర్వతాలెక్కాయని అంటున్నారు.

మరోపక్క #Kokapet అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో పాటు.. నటి ఝాన్సీ, #KokapetAunty పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో ఉన్నాయి. 2007లో వెంకటేష్ నటించిన "తులసి" చిత్రంలో ఝాన్సీ "కోకాపేట్ ఆంటీ"గా నటించిన సంగతి తెలిసిందే. తమ కోకాపేట్ భూములను అమ్మి ధనవంతురాలిగా మారినట్లు సినిమాలో ఆ పాత్ర ఉంటుంది.

తాజాగా కోకాపేట ల్యాండ్స్ ఎకరం 100 కోట్ల రూపాయలు పలగడంతో... కోకాపేట్ భూముల విలువ కోట్లాది రూపాయలని ఝాన్సీ చాలా కాలం క్రితమే పేర్కొన్నారని చెబుతూ... ఈ వీడియో క్లిప్‌ ను షేర్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Full View

Kokapet lo ma taatha ki oka ekaram land unnattu kala ochindi pic.twitter.com/Ewosv6vOQt

— Doobu (@XDoobu) August 4, 2023

Kokapet Rallaguttalu ekaram 100 kotlu anta…govt land la auction eh ila unte akkada private vallaki bumper jackpot eh ga….Intha chesi avanni malli high rise le katti sastharu oka tower lo vacche daanitho BE project ipoddi pic.twitter.com/W8EV4Mxo43

— Day Dreamer!!! (@bunnywrites) August 3, 2023

ఎకరం 100 కోట్లు పలికిన కోకాపేట ల్యాండ్ |
One Acre Land Value 100 crores #kokapet #Hyderabad #hmda #Auction @HiHyderabad pic.twitter.com/NHk8JeIh6b

—  Aditya ✪ (@Glorious_Aditya) August 3, 2023

pic.twitter.com/wUH5By3k60

— Venkat Reddy Surusani (@SurusaniV) August 4, 2023
Tags:    
  • Kokapetlands 
  • Hyderabadrealestate 
  • Realestate 
  • Kokapet 
  • Kokapetaunty 
  • Brsgovernment 
  • Kokapetrealestate 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS