• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎన్నికల ప్రచారం నుంచి ...

ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్న ఖుష్బూ... రెండు కారణాలంట!

| ఈ నేపథ్యంలో ఇంతలోనే తాను ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఇలా ఖుష్భూ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-04-08 11:30 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులూ ప్రచారాలకు తెరలేపారు. ఇక ప్రధాన పార్టీలైతే.. స్టార్ క్యాపెయినర్ లతో హోరెత్తించేస్తున్నాయి! ఈ సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బు.. ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు! దీంతో... ఇంత కీలక సమయంలో ఖుష్బు ఇంత కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

 

అవును... బరువెక్కిన హృదయంతో ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నా అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు.. ఖుష్బూ ఒక లేఖ రాశారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. శనివారం దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళి సై సౌందర్ రాజన్ కు మద్దతుగా ఖుష్బూ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఇంతలోనే తాను ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

 

ఇలా ఖుష్భూ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకుండా బీజేపీ దూరం పెట్టడమే కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు! మరోపక్క ఇటీవల పార్టీలో చేరిన మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కు లోక్ సభ టిక్కెట్ ఇవ్వడాన్ని కూడా ఆమె జీర్ణించుకోలేకపోతున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది!

కాగా... గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఖుష్బూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో చెన్నై లోని మూడు లోక్‌ సభ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ఆమెకు కేటాయిస్తారని భావించారు. కానీ, ఆమెకు బీజేపీ మొండిచెయి చూపించింది. దీంతో.. ఆమె అలిగారని, అందుకే ప్రచార కార్యక్రమాల నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది!

అయితే.. ఆమెకు టిక్కెట్ ఇవ్వకపోవడం అనే విషయంలో బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉందని.. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పాటు అందుకు పలు కారణాలున్నాయని చెబుతున్నారంట. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1000 ని బిక్ష అంటూ ఆమె వ్యాఖ్యానించడం.. ఆ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవ్వడం కూడా మరో కారణం అని చెబుతున్నారంట!

కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా తనకైతే టిక్కెట్ దక్కలేదని.. అందుకే ఆమె హర్ట్ అయ్యారని.. ఫలితంగా ప్రచారం నుంచి తప్పుకున్నారని అంటున్నారు!

At times, hard decisions have to be taken and focus needs to be on one's health. I am at such a juncture today. I have dedicated myself to @BJP4India and have been following the path of our beloved PM @narendramodi ji, immersing myself in the election campaign activities. But… pic.twitter.com/tuevsqczok

— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) April 7, 2024
Tags:    
  • Khushboo 
  • Electioncampaign 
  • Assemblyelection 
  • Loksabha 
  • Jpnadda 
  • Bjp 
  • Politics 
  • Tamilsaisoundarrajan 
  • Narendramodi 
  • Politicalnews 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS