విద్యార్థిపై టీచర్ పాడుపని.. బయటకు రావటంతో సూసైడ్

బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి వికారపు అలవాట్లతో ఒక ఉపాధ్యాయుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా చాలించిన ఉదంతంగా దీన్ని చెప్పాలి.;

Update: 2025-10-14 04:32 GMT

బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి వికారపు అలవాట్లతో ఒక ఉపాధ్యాయుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా చాలించిన ఉదంతంగా దీన్ని చెప్పాలి. గురుకులంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ.. వారిని పైకి తీసుకురావాల్సిన అతను.. తనకున్న వికారపు ఆలోచనలతో మూడేళ్లుగా లైంగిక వేధింపులకు గురి చేయటం.. తాజాగా ఆ ఛండాలం బయటకు రావటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన ఒక బాలుడు గురుకులంలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వచ్చిన అతను.. తిరిగి వెళ్లేందుకు ససేమిరా అంటున్నాడు. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో ఆ పిల్లాడ్ని గట్టిగా గదామాయించారు. దీంతో.. తనకు ఇస్కూల్లో పని చేసే టీచర్ నుంచి ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొని వాపోయాడు. గురుకులంలో తనకు మూడేళ్లుగా ఎదురవుతున్న నరకాన్ని చెప్పుకొని.. తాను ఇక వెళ్లలేనని కన్నీటిపర్యంతమయ్యడు.

దీంతో.. షాక్ తిన్న విద్యార్థి తల్లిదండ్రులు మధిరకు చెందిన సదరు టీచర్ చేసిన పాడు పనులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు కట్టారు. ఈ సమాచారాన్ని గురుకులం ప్రధాన ఉపాధ్యయుడికి సమాచారం అందించటంతో ఆయన సదరు ఉపాధ్యాయుడ్ని పిలిపించి మందలించారు. దీంతో.. తన పాడుపని బయటకు రావటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

తనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయాన్ని తెలుసుకొని తన పరువు పోతుందన్న భయాందోళనలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో.. వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పాడు పనులకు పాల్పడి.. అంతిమంగా తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఉపాధ్యాయుడి వ్యవహరశైలి ఇప్పుడు సంచలనంగా మారింది.

Tags:    

Similar News