తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ పై కేకే హాట్ కామెంట్స్

తెలంగాణ ఏర్పాటుపై రకరకాల విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు

Update: 2024-03-29 11:04 GMT

తెలంగాణ ఏర్పాటుపై రకరకాల విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేసి ఢిల్లీ పెద్దలను ఎదిరించారు. రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలను వెలిబుచ్చారు. దీంతోనే కేంద్రం రాష్ట్ర ఏర్పాటుపై సరైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదు. కానీ కొన్ని పార్టీలు మాత్రం తామే తెలంగాణ తీసుకొచ్చామని పదేళ్లు పబ్బం గడుపుకోవడం విడ్డూరమే.

ఏవో డ్యాన్సులు చేస్తే తెలంగాణ రాలేదు. దానికి చాలా కసరత్తు జరిగింది. ప్రతి ఒక్కరి మదిలో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష బలంగా నాటుకుంది. దీంతోనే అందరు ముక్తకంఠంతో ఎదిరించి తమ వాంఛ తీర్చుకున్నారు. అంతేకాని ధర్నాలు, పాటలు, డ్యాన్సులతో రాష్ట్రం రాలేదనే సంగతి తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదనే వాదనలు వస్తున్నాయి.

డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటనతో యావత్ తెలంగాణ పులకించింది. కానీ ఆంధ్రా వాళ్ల నీచ రాజకీయంతో మరోమారు మనం ఉద్యమించాల్సి వచ్చింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు గొంతెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని నినదించారు. అంతేకాని ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో తెలంగాణ రాలేదనే విషయం అందరికి తెలుసు.

Read more!

అప్పుడు కాంగ్రెస్ ఎంపీల సహకారం మరువలేనిది. యావత్ దేశంలోని ఎంపీలు తెలంగాణకు మద్దతు తెలపడంతో ప్రజల కాంక్ష నెరవేరింది. ఇది ఎవరి వల్లో జరగలేదు. మన కోరిక బలంగా ఉండటంతోనే తీరింది. కొందరు మాత్రం తమ వల్లే రాష్ట్ర ఏర్పాటు సాధించామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమే. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర లేదు. అందరి సహకారం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేశవ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధించుకోవాలనే తపన ఉండటం వల్లే సాధ్యమైంది. దానికి ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారా? దానికి కారణమైన వారిని ప్రజలు గుర్తుంచుకుంటారు. రాష్ట్రానికి కీడు చేసిన వారిని సైతం తరిమికొడతారని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags:    

Similar News