సిట్టింగులే ఫిట్టింగ్ పెట్టారు...కేసీఆర్ లైట్ తీసుకున్నారు...
కానీ పార్టీ మీటింగులలో వారిని హెచ్చరిస్తూ వచ్చిన కేసీఆర్ తీరా ఎన్నికల వేళకు మాత్రం అందరికీ టికెట్లు ఇచ్చేశారు;
కేసీఆర్ లో అతి ధీమా ఈసారి ఎన్నికల్లో కనిపించింది. అందుకే ఆయన వరస తప్పులు చేస్తూ పోయారు అని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనీసంగా ముప్పయి మంది దాకా జనంలో బీభత్సమైన వ్యతిరేకత మూటకట్టుకున్నారు. వారిని చేంజ్ చేసి కొత్త ముఖాలను టికెట్ ఇచ్చి ఉంతే మాత్రం బీఆర్ఎస్ మరోమారు తెలంగాణాలో అధికారంలోకి వచ్చి ఉండేది.
కానీ పార్టీ మీటింగులలో వారిని హెచ్చరిస్తూ వచ్చిన కేసీఆర్ తీరా ఎన్నికల వేళకు మాత్రం అందరికీ టికెట్లు ఇచ్చేశారు. దీని వల్లనే బీఆర్ఎస్ అధికారానికి దూరం అయింది అని ఒక విశ్లేషణ ఇపుడు బయటకు వచ్చింది.
ఈ విశ్లేషణ చేసింది ఎన్డీటీవీ. ఒక కధనం ఎన్డీటీవీ లేటెస్ట్ గా ప్రసారం చేసింది. అందులో స్పష్టంగా పేర్కొంది అదే. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటే దాన్ని కేసీఆర్ గమనించలేకపోయారు. అలాగే వారిని మార్చలేకపోయారు అని ఆ కధనం పేర్కొంది.
ఇక పాతవారి ప్లేస్ లో కొత్తవారికి చాన్స్ ఇచ్చిన చోట పదికి తొమ్మిది మంది గెలిచారు అని కూడా గుర్తు చేసింది. చివరికి అదే కొంప ముంచింది అని కూడా తేల్చేసింది. సిట్టింగులలో అసంతృప్తి ప్రజలలో ఎక్కువగా ఉన్న వారు అంతా ఓడిపోయారు అని కూడా ఎన్డీటీవీ తన విశ్లేషణలో ఎత్తి చూపింది.
మరి రాజకీయ వ్యూహకర్త అయిన కేసీఆర్ కి ఈ విషయాలు తెలియవు అని అనుకోవాలా అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. కేసీఆర్ ఎందుకు మెత్తబడిపోయారు అన్నది మరో ప్రశ్న. ఆయన కనుక తలచుకుంటే హరిహరాదులు అడ్డు వచ్చినా తాను అనుకున్నది చేసుకుని పోతారు. అలాంటిది ఆయన ఎందుకు వారిని మార్చలేకపోయారు అన్నది ఒక డౌట్.
ఆయన తెలుసుకోలేకపోయారు అన్నది కూడా వాస్తవం కాదు అందరికీ టికెట్లు ఇవ్వాలంటే వ్యతిరేకత ఉండరాదు అని ఆయన పదే పదే చెప్పారు. ముప్పయి మంది మీద వ్యతిరేకత ఉందని పార్టీలో చర్చ కూడా సాగింది. అన్ని జరిగినా కూడా కేసీఆర్ చివరికి వారినే జనంలోకి పంపారు. వారు ఓడి వచ్చి మాజీలు అయ్యారు. అలా కేసీయార్ ని మాజీని చేసేశారు.