• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బిగుసుకుంటున్న...

బిగుసుకుంటున్న ఉచ్చు..కేసీఆర్ ఫుల్ సైలెంట్ !

| ఆనాడు కేసీఆర్ ని టచ్ చేయడానికి కూడా జాతీయ నాయకత్వాలు సైతం జడిసి దూరం జరిగిన పరిస్థితి ఉండేది.

By - Tupaki Desk
Update: 2024-12-22 03:20 GMT

కేసీఆర్ లో అదే గొప్ప గుణం. ఆయన ఎక్కడ ఫైర్ అవాలో బాగా తెలిసిన వారు. అపుడు ఆయన నిప్పు కణిక లాగానే కనిపిస్తారు. ఉదాహరణకు తెలంగాణా ఉద్యమం. ఆనాడు కేసీఆర్ ని టచ్ చేయడానికి కూడా జాతీయ నాయకత్వాలు సైతం జడిసి దూరం జరిగిన పరిస్థితి ఉండేది.

అలా ఉద్యమాన్ని కొన్నేళ్ళ పాటు నడిపి చివరికి విజయాన్ని ముద్దాడి తెలంగాణాను సాధించిన ఘనత కేసీఆర్ ది. ఆ మీదట రెండు సార్లు సీఎం గా పనిచేసి తనదైన శైలిలో పాలన చేశారు. ఆయన మీడియా ముందుకు వస్తే చాలు చెడుగుడు ఆడేవారు. ప్రత్యర్థుల మీద ఆయన మాటలతో శర సంధానమే చేసేవారు. కేసీఅర్ ని తట్టుకోవడం కష్టమే అన్న భావన అయితే అంతటా ఉండేది.

అదే విధంగా అసెంబ్లీలో అయితే కేసీఆర్ ప్రసంగం చేస్తే ఇక విపక్షంలో ఎవరు ఉన్నా మళ్ళీ మాట్లాడనీయకుండా చేసేవారు. ఆయన రాజకీయం అలాంటిది. అటువంటి కేసీఆర్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అంతే కాదు ఫార్మ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆయన ఏడాది కాలంలో ఒకే ఒకసారి అసెంబ్లీకి వచ్చారు.

ఇక ఆయన జనంలోకి తొందరలో వస్తారు అని ఒక వైపు వార్తలు వస్తూంటే ఆయన రెస్ట్ తీసుకోవడానికి అమెరికా వెళ్తారు అని రెండు నెలల పాటు అక్కడే ఉంటారు అని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కుమారుడు కేటీఆర్ మీద కేసులు పడ్డాయి. ఒక వైపు ఏసీబీ కేసు ఫైల్ చేస్తే మరో వైపు ఈడీ కేసు ఫైల్ చేసింది.

ఈ రెండు కేసులతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అని అంటున్నారు. ఈడీ కేసు అంటే కవితను గతంలో అరెస్ట్ చేసి తీహార్ జైలులో నెలల పాటు ఉంచారు. మరి అలాంటి పరిస్థితి ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ అధినేతగా, దానికి మించి తండ్రిగా కేసీఆర్ అయితే ఎక్కడా రియాక్ట్ కాలేదు. కేసులు నమోదు అయి రెండు మూడు రోజులు అయింది. కేసీఆర్ నుంచి స్టేట్ మెంట్ ఒక చిన్నది కూడా లేదు.

మరి ఎందుకు ఈ మౌనం, దీని వెనక ఏమిటి వ్యూహం అన్నదే చర్చనీయాంశంగా ఉంది. కేసీఅర్ మౌనం ఎపుడూ తుఫాను ముందు నిశ్శబ్ద వాతావరణం అని అంతా అంటారు. ఆయన కనుక మౌన ముద్ర దాలిస్తే ఏదో యాక్షన్ ప్లాన్ దాని వెనక ఉంటుందని చెబుతారు

అయితే కేసేఅర్ గతంలో తన కుమార్తెని అరెస్ట్ చేసినపుడు మీడియా ముందుకు రాలేదు, తెర వెనకే ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన ఏ రకంగా ఆలోచించారో ఏ విధంగా ప్రయత్నాలు చేశారో ఎవరికీ తెలియదు. ఇపుడు చూస్తే మళ్లీ కుమారుడి వంతుగా ఉంది. ఈ విషయంలో కేసీఅర్ ఏమి చేయబోతున్నారు అన్నదే అంతటా డిస్కషన్ గా ఉంది.

అయితే తన కుమారుడి మీద కేసులు పడడంతో కేసీఅర్ కలత చెందుతున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఏసీబీ కేసుల విషయంలో పెద్ద ఫికర్ లేకపోయినా ఈడీ ఎంట్రీయే ఇపుడు బీఆర్ఎస్ ని కలవరపెడుతోంది అని అంటున్నారు. ఒకసారి కనుక ఈడీ అరెస్ట్ చేస్తే కనీసంగా ఆరు నెలల వరకూ బెయిల్ కూడా రాదు అని ప్రచారం అయితే ఉంది. పైగా కవితను ఉంచినట్లుగానే తీహార్ జైలుకే తీసుకుని వెళ్తారా అన్న చర్చ కూడా సాగుతొంది. ఇవన్నీ ఇపుడు కేసీఅర్ లో కలవరం రేపుతున్నాయని అంటున్నారు.

ఏది ఏమైనా ఏసీబీ కేసు అయితే అరెస్ట్ అయినా రాజకీయంగా మైలేజ్ రావచ్చు సానుభూతి వస్తుందని ఎవరైనా అనుకోవచ్చు. ఈడీ కేసులు ఏకంగా తెలంగాణా నుంచి దూరంగా ఎక్కడో జైలులో ఉంచితే మాత్రం బీఆర్ఎస్ లో కొత్త ఇబ్బందులే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • Congressparty 
  • Brsparty 
  • Bjp 
  • Revanthreddy 
  • Telanganacm 
  • Kcr 
  • Ktr 
  • Media 
  • Assembly 
  • Telanganaassembly 
  • EDcases 
  • ACB 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS