ప్రజ్వల్ ను దేశం దాటించారు .. నన్ను బంధించారు

నా లాంటి వారిని మాత్రం అరెస్ట్ చేసి బంధించారు' ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-07 17:35 GMT

'ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని వదిలేసి దేశం దాటించారు. నా లాంటి వారిని మాత్రం అరెస్ట్ చేసి బంధించారు' ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ చాలా అన్యాయం అని కవిత వాపోయారు.

లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మే 14వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. జుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్యాఫ్తు సంస్థల అధికారులు కవితను కోర్టు ముందు హాజరుపరిచారు.

కవిత కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ కోరాయి.జైల్లో కవితకు పుస్తకాలుకు అనుమతించాలని కోరారు. కవితకు పంపించే ఇంటి భోజనాన్ని 10 నుంచి 15మంది పోలీసులు చెక్ చేస్తున్నారని, తర్వాత పాడైన ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టుకు వివరించారు. డాక్టర్, జైలు అధికారి మాత్రమే చెక్ చేసి అందించాలని కోరారు. దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ కోరతామని జడ్జి తెలిపారు.

10 పుస్తకాలు ఇచ్చేందుకు అనుమతిని కోర్టు ఇచ్చింది. కోర్టులో కవితను 15 నిమిషాల పాటు కలిసేందుకు కుటుంబసభ్యులను అనుమతించాలని కవిత తరపు న్యాయవాది కోరగా అనుమతి ఇచ్చారు.

Read more!

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు, హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణలు వందలాది మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించిన వీడియోలు దాదాపు 3 వేలకు పైగా బయటికి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీడియోలు బయటికి రాగానే జర్మనీ పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి.

Tags:    

Similar News