జిల్లాల వారీగా కవిత లెక్కలు.. తెలుసా?!
కొత్త పార్టీ పేట్టుకుని.. కొత్త రాజకీయాలు చేసేందుకు ముందుకు వస్తున్న మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత జిల్లాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు.;
కొత్త పార్టీ పేట్టుకుని.. కొత్త రాజకీయాలు చేసేందుకు ముందుకు వస్తున్న మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత జిల్లాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి(టీపీజే) పేరుతో పార్టీని నమోదు చేసుకున్న ఆమె.. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని ప్రజలతో పంచుకోనున్నారు. అయితే.. ఈలోగా నే కవిత గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా తనకు ఉన్న బలబలాలను ఆమె అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి మూడు!
ప్రస్తుతం కవిత పార్టీ పేరును ఖరారు చేయకముందే.. మూడు జిల్లాల్లో తమకు భారీ బలం ఉందని ప్రక టించారు. వీటిలో 1) నిజామాబాద్: గతంలో నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా విజయం దక్కించుకున్నా రు. ఇది ఆమెకు సానుకూలంగా మారే పరిస్థితి ఉందని అంచనా వేసుకుంటున్నారు. ఎంపీగా అప్పట్లో చేసిన అభివృద్ధి.. ఆయా ప్రాంతాల సమస్యలపై ఉన్న పట్టు కారణంగా.. తమ పార్టీకి ఇక్కడి ప్రజలు జై కొడతారని అంచనా వేసుకుంటున్నారు.
2) ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సహజంగానే బీఆర్ ఎస్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఈ జిల్లాలో బీఆర్ ఎస్ పుంజుకుంది. అయితే.. ఆ వర్గాన్ని తనవైపు తిప్పుకొనేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి సింగరేణి బొగ్గు గనులకు కవితకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఆమె సింగరేణి.. కార్మికుల పక్షాన నిలబడ్డారు. కార్మికుల సంఘానికి చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఈ ప్రభావంతో ఇక్కడ కొత్త పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని అంచనా వేస్తున్నారు.
3) ఆదిలాబాద్: ఇది మహారాష్ట్రకు అత్యంత చేరువలో ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన, ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు ఉంటారు. వారి ఓటు బ్యాంకు తనదేనని కవిత భావిస్తున్నారు. అయితే.. ప్రత్యక్షంగా ఆమెకు.. ఈ జిల్లాకు సంబంధం లేకపోయినా.. గతంలో ఎంపీగా ఉన్నసమయంలో ఇక్కడ జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించడంలో ప్రభుత్వంతో కలిసి సాయ పడ్డారు. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పుడు మేలు చేస్తాయని కవతి లెక్కలు వేసుకుంటున్నారు.
4) హైదరాబాద్-రంగారెడ్డి: ఈ రెండు జంట జిల్లాల్లోనూ కవిత రాజకీయాలకు కలిసి వచ్చే పరిణామాలు ఉన్నాయన్నది జాగృతి నేతల ఆలోచన. మెజారిటీ రాజకీయ అడుగులు కవిత ఇక్కడ నుంచే వేయడం.. బీఆర్ ఎస్ వ్యతిరేక వర్గం కూడా.. ఇక్కడే ఉండడం.. వంటివి తనకు సరిపోతాయన్న భావన కనిపిస్తోంది. అటు కాంగ్రెస్-ఇటు బీఆర్ ఎస్ కాని పక్షాలు.. ఇతర పార్టీలతో విభేదించే వారు తనకు కలిసి వస్తారన్న అంచనాలు వేసుకుంటున్నారు. ఇలా.. ఇప్పుడే జిల్లాల వారీగా ఒక అంచనా వేసుకుంటున్న కవిత.. పార్టీ పెట్టాక.. మరింత ఎక్కువగా దూకుడు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.