సర్జికల్ స్ట్రైక్ పై చర్చ మొదలు... వాట్ నెక్స్ట్ మోడీ జీ?

అవును... పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యక్రమాలు సాగిస్తున్న "లష్కరే తోయిబా" అనుబంధ విభాగం "ద రెసిస్టెన్స్ ఫ్రంట్" తాజాగా బైసరన్ లోయలో కాల్పులకు పాల్పడింది.;

Update: 2025-04-23 04:31 GMT

జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయిన సంగతి తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులను ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.

అవును... పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యక్రమాలు సాగిస్తున్న "లష్కరే తోయిబా" అనుబంధ విభాగం "ద రెసిస్టెన్స్ ఫ్రంట్" తాజాగా బైసరన్ లోయలో కాల్పులకు పాల్పడింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఆరుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

అమర్నాథ్ యాత్ర నేపథ్యంలోనేనా?:

దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన తాజాగా జమ్ముకశ్మీర్ లో జరిగింది. కశ్మీర్ లో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందనే చర్చా జరుగుతోంది.

జూలై 3 నుంచి ప్రారంభం కానున్న ఈ అమర్నాథ్ యాత్ర 38 రోజుల పాటు జరగనుంది. ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఈ మార్గాల్లో ఒకటి.. అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కి.మీ. దూరం.

వెళ్లి మోడీకి చెప్పుకోండి!:

ఈ ఘటనలో ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... కర్నాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన మంజునాథ.. భార్య, కుమారుడితో కలిసి కశ్మీర్ టూర్ లో ఉన్నారు. ఈ క్రమంలో తన కుమారుడు, భార్య ముందే ముష్కరులు మంజునాథ్ రావును తలలో కాల్చి చంపారు.

ఈ సమయంలో గుండెలవిసేలా రోదించిన ఆమె... తన భర్తనే కాదు తమనూ కాల్చేయాలని ముష్కరులతో గొడవకు దిగింది. ఈ సమయంలో వారి కుమారుడూ ఇదే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఉగ్రవాదులు ఆమెతో... "వెళ్లి మోడీకి చెప్పుకోండి" అంటూ సమాధానం చెప్పారు.

మోడీ మదిలో ఏముంది?:

జమ్ముకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటున భారత్ చేరుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగిన ప్రధాని మోడీ.. ఎయిర్ పోర్ట్ లోనే అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా... కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రం మిస్త్రీతో లు ఈ భేటీలో పాల్గొనగా.. వారు దాడి జరిగిన తీరును ప్రధానికి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది తీవ్ర ఆసక్తిగా మారింది.

భారత్ పై దాడి చేసిన ఉగ్రవాదుల విషయంలో మోడీ ఎంత కఠినంగా ఉంటారనేది తెలిసిన సంగతే. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడంలో ఆయన లెక్కే వేరని అంటారు. ఈ సందర్భంగా ఉరి – సర్జికల్ స్ట్రైక్ పై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. పాక్ ప్రేరేపిత, పాక్ ప్రోత్సహిత ఉగ్రవాదులపై తాజా దాడి నేపథ్యంలో కౌంటర్ మామూలుగా ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. సో... వాట్ నెక్స్ట్ మోడీ జీ? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది!

Tags:    

Similar News