పెళ్లికి నో చెప్పిందని వివాహితను చంపేసి సూసైడ్ చేసుకున్న చిన్ననాటి మిత్రుడు

ఆమె చిన్ననాటి స్నేహితుడు రఫీక్. ఆమె ఉన్న ప్రాంతంలోనే ఉండేవాడు. భర్తతో విడిపోయిన తర్వాత నుంచి తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు.;

Update: 2026-01-05 08:30 GMT

సంచలన నేరాలకు.. దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది కర్ణాటక రాష్ట్రం. 2025లో పలు దారుణ.. సంచలన నేరాలకు నెలువుగా నిలిచిన కర్ణాటక.. కొత్త సంవత్సరంలోనూ ఇదే తీరును ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా తాజా దారుణం వెలుగు చూసింది. ఉత్తర కర్ణాటకలోని యల్లాపురలోని ఒక స్కూల్లో 30 ఏళ్ల రంజినా అనే మహిళకు పెళ్లైంది. ఆమె భర్త సచిన్ నుంచి ఐదేళ్లుగా వేరుగా ఉంటోంది.

ఆమె చిన్ననాటి స్నేహితుడు రఫీక్. ఆమె ఉన్న ప్రాంతంలోనే ఉండేవాడు. భర్తతో విడిపోయిన తర్వాత నుంచి తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఒత్తిడి తెచ్చేవాడు. అయితే.. అతడి ప్రతిపాదనకు ఆమె నో చెబుతూ ఉండేది. దీంతో.. అతను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. ఇదిలా ఉండగా తాజాగా ఆమె స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న వేళలో.. దారి మధ్యలో కాపు కాసిన రఫీక్ కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు

దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హుబ్బళ్లికి తరలించారు. వైద్యుల చికిత్సకు ఆమె శరీరం స్పందించటం మానేసింది. తాజా పరిణామాలతో భయపడిన రఫీక్ పారిపోయాడు. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతాన్ని లవ్ జిహాద్ ఘటనగా కొన్ని హిందూ సంగాలు నిందితుడ్ని పట్టుకోవాలని పేర్కొంటూ యల్లాపుర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇదిలా ఉండగా నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీసు దళాల్ని ఏర్పాటు చేశారు. మల్లాపురకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అటవీ ప్రాంతంలో రఫీక్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. తాజా పరిణామాలు అనవసర ఉద్రిక్తతలకు దారి తీయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News