• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మస్క్ కు గడ్డి పెట్టిన...

మస్క్ కు గడ్డి పెట్టిన కమల్ హాసన్.. తాజా పోస్టులో వాయించేశాడు

| గడిచిన రెండు.. మూడు రోజులుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న పోస్టుల పంచాయితీ తెలిసిందే.

By - Garuda Media
Update: 2026-10-10 17:30 GMT

గడిచిన రెండు.. మూడు రోజులుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న పోస్టుల పంచాయితీ తెలిసిందే. భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ అతను చేస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మస్క్ పోస్ట్ పెట్టినంతనే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల గాంధీ స్పందించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశ ప్రధాని పదవిలో కూర్చునేందుకు తహతహలాడుతున్న రాహుల్.. మస్క్ చేస్తున్న దాడిని అర్థం చేసుకునే విషయంలో ప్రదర్శిస్తున్న వైఖరిపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ నటుడు కం రాజకీయ నేత కమల్ హాసన్ స్పందించిన తీరు చూస్తే.. ఈ మాత్రం అవగాహన రాహుల్ లో మిస్ అయ్యిందన్న భావన కలుగక మానదు.

మస్క్ పెడుతున్న పోస్ట్ లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కమల్ హాసన్. ‘‘మిస్టర్ మస్క్.. భారతీయుడైనా.. అమెరికన్ అయినా ఏ బిలియనీర్ కూడా ఒక దేశ విధానాల్ని శాసించకూడదు’’ అంటూ సింఫుల్ గా ఒక్క ముక్కలో తేల్చేశారు. స్టార్ లింక్ కంపెనీకి అనుమతులు ఇచ్చే విషయంలో అంతులేని జాప్యం జరుగుతుందన్న మస్క్ మాటల్లో వాస్తవం కొంతమాత్రమే. ఆయన తరహాలోనే సేవలు అందించేందుకు మస్క్ మాదిరే లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తున్న రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ సంస్థలకు కూడా భారత ప్రభుత్వం అనుమతులను పెండింగ్ లో ఉంచింది. ఈ వాస్తవాన్ని చెప్పని మస్క్.. తనకు మాత్రమే ఏదో అన్యాయం జరుగుతుందని పోస్ట్ లు పెట్టటం.. తన పోస్ట్ లతో భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయటం ఏ మాత్రం సమర్థనీయం కాదు.

ఇదంతా చూస్తున్నప్పుడు.. మస్క్ ఆడుతున్న మైండ్ గేమ్ లో రాహుల్ ఎందుకు పావుగా మారారు? అన్నది ప్రశ్న. ఆ మాటకు వస్తే రాహుల్ మాదిరే బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సైతం అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆయన కూడా మస్క్ పోస్ట్ కు స్పందించారు. మస్క్ వ్యాఖ్యలను తప్పు పట్టిన కమల్ హాసన్ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. కమల్ తాజా పోస్ట్ ను చూస్తే.. మస్క్ తీరును తప్పు పట్టటమే కాదు.. ఒక దేశ ప్రయోజనాల్ని ఆ దేశ ప్రజలు.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలే తప్పించి.. మరెవరూ కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు. కమల్ పోస్ట్ స్పష్టత.. ఆయన ప్రస్తావించిన అంశాల్ని చూస్తున్నప్పుడు.. భారతదేశ ప్రతిపక్ష నేతలో ఇంతటి అవగాహన ఎందుకు మిస్ అయ్యిందన్న భావన కలుగక మానదు.

తన సుదీర్ఘ పోస్ట్ లో కమల్ మరిన్ని అంశాన్ని ప్రస్తావించారు. అవేమంటే.. ‘‘మన నెట్ వర్క్ లు.. స్పెక్ట్రమ్ కేవలం వాణిజ్య ఆస్తులు కావు. అవి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలన్న విషయం భారతదేశానికి తెలుసు. ప్రతి దేశం తన సొంత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పాశ్చాత్య దేశాలు తమ దేశంలో సంరక్షణవాదాన్ని పాటిస్తూ స్వేచ్ఛా మార్కెట్ల గురించి బోధించలేవు. అమెరికా తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవటానికి చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై వంద శాతం సుంకాల్ని విధించింది. అదే విధంగా భారతదేశం కూడా తన దేశీయ తయారీదారులను రక్షించుకోవటానికి చర్యలు తీసుకుంటుంది.ప్రజాస్వామ్య దేశంగా మా బలాలు.. బలహీనతల గురించి భారతీయులు అంతర్గతంగా చర్చించుకుంటారు. ప్రశ్నించుకుంటారు. పరిష్కరించుకుంటారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. వలస దేశం కాదు. మేం ప్రపంచాన్ని స్వాగతిస్తాం. మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం. ఏ బిలియనీర్ నిర్ణయించలేరు’’ అంటూ చేసిన పోస్ట్ ను చూసినప్పుడు రాహుల్.. కేటీఆర్ లాంటి రాజకీయ నేతలు దేశ ప్రజల ప్రయోజనాల్ని ఎలా విస్మరించారన్న భావన కలుగకమానదు.



Mr. Musk, yes, no billionaire should dictate a nation’s policy - Indian or American. India must welcome competition in satellite internet, from Indian and global providers, whoever offers the most practical and affordable last-mile solution for those in remote regions. In countries with lower per-capita incomes, satellite internet must be affordable too. High subscription fees and equipment costs risk putting it beyond the reach of ordinary households. Connectivity must bridge the digital divide, not create a new one. India knows our networks and spectrum are strategic infrastructure, not merely commercial assets. India’s national security safeguards are non-negotiable. Every country makes choices based on its own interests. Those in the West cannot preach free markets while practicing protectionism at home. USA imposed 100% tariffs on Chinese EVs to protect its domestic industry, just as India takes measures to protect its own domestic manufacturers. Both India and the US have restricted Huawei over security concerns. One cannot demand a level playing field from others only when it suits its own agenda. Indians will internally debate, question and address our strengths and shortcomings as a democratic country. Take BharatNet, India’s programme to bring broadband to village-level local bodies. We will question why, as the CAG’s 2026 audit report found, the programme is struggling to meet its original objectives. Why were only 33.2% of service-ready Gram Panchayats operational, despite ₹39,888 crore being spent? At the same time, we know to appreciate our telecom sector and regulations, which has made internet data among the world’s most affordable, bringing millions online. India is a democracy, not a colony. We welcome the world, but we, the Indian people, will decide our own future - not Western vested interests, their double standards or any billionaire - Indian or American.

— Kamal Haasan (@ikamalhaasan) October 9, 2026


Tags:    
  • kamalhaasan 
  • elonmusk 
  • starlinkindia 
  • indianpolitics 
  • telecompolicy 

Similar News

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

2026-11-24 18:22 GMT

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

కవితక్క...సెటిలర్ల అస్త్రం..

2026-11-24 18:21 GMT

ఒక్క రోజులోనే రూ.3 లక్షల కోట్ల సంపద పెరుగుదల.. జెన్సన్ హువాంగ్‌కు జాక్‌పాట్ ఎలా తగిలింది?

2026-11-24 18:20 GMT

సింధూ దేశ్ ఉద్యమం షురూ.. మరోసారి ముక్కలయ్యే దిశగా పాకిస్తాన్..?

2026-11-24 18:20 GMT

చివ‌ర‌కు.. ప‌వ‌న్ మాటే 'గెలిచింది'!

2026-11-24 18:17 GMT

"జిన్‌పింగ్ త‌ర్వాత మోడీనే.. తెలిసిందా రాహుల్‌"

2026-11-24 18:16 GMT

డిసెంబర్ 3న విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. 'పరివర్తన రాజనీతి పార్టీ' దిశ, దశపై ఉత్కంఠ!

2026-11-24 18:11 GMT

52 బంతుల్లో డబుల్ సెంచరీ.. ఇదేం కొట్టుడు సామీ.. మేమెప్పుడు చూడలా..

2026-11-24 18:10 GMT

మరణశిక్ష ఎదుర్కొంటున్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా.. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు రీ ఎంట్రీ

2026-11-24 18:02 GMT

కాకినాడ మత్స్యకారుల మిస్సింగ్ మిస్టరీ : రెండు బోట్లు వెళ్తే.. తిరిగొచ్చింది ఒక్కటే!

2026-11-24 18:01 GMT

వెలగని దీపం.. రగిలిన వివాదం.. తిరుపరంకుండ్రంలో భక్తుల ఆందోళన.. పోలీసుల రంగప్రవేశం

2026-11-24 17:15 GMT

Copyright @2026

Powered by Blink CMS