60 ఇయర్స్ హిస్టరీ అంటున్న టీడీపీ తమ్ముడు

ఈ నేపధ్యంలో కలమట టీడీపీ నుంచి దూరం అవుతారు అని ప్రచారం సాగుతోంది. దాని మీద స్ట్రంగ్ గా ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను టీడీపీని వీడిపోను, రాజకీయాలను అంతకంటే వీడేది లేదని స్పష్టం చేశారు.;

Update: 2025-12-26 03:41 GMT

రాజకీయాల్లో చరిత్ర చాలా ముఖ్యమే. వాటినే కొలమానంగా తీసుకుని తమ క్రెడిట్ ని చెప్పుకుంటారు. అందువల్ల కాలంతో గేలం వేసి మరీ పదవులు అందుకోవాలని చూస్తారు. అదేదో సినిమాలో థర్టీ ఇయర్స్ హిస్టరీ అని ఇక పాపులర్ డైలాగ్ ఉంది. ఇపుడు రాజకీయాలో కూడా తమది 60 ఇయర్స్ హిస్టరీ అంటున్నారు టీడీపీ తమ్ముడు. ఆయన సీరియస్ గానే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు అంటే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి . ఆయన ఎమ్మెల్యేగా గతంలో గెలిచి ఉన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఖాళీగా ఉన్నారు.

టీడీపీ నుంచే :

ఇక కలమట ఫ్యామిలీ గతంలో అనేక సార్లు పాతపట్నంలో గెలిచింది. తొలిసారిగా 1978లో కలమట మోహన రావు ఇండిపెండెంట్ గా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత టీడీపీలో చేరి 1989, 1994లలో మరో రెండు సార్లు గెలిచారు. ఇక 1999, 2004లో కూడా మరో రెండు సార్లు గెలిచారు. అలా చూస్తే అయిదు సార్లు కలమట మోహన రావు గెలిచి బలంగానే జెండా పాతారు. ఆయన వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కలమట వెంకట రమణ మూర్తి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2017 నాటికి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ని సాధించి పోటీ చేశారు. కానీ వైసీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు. 2024 ఎన్నికల్లో మామిడి గోవిందరావుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన గెలిచారు. టికెట్ ఆశించిన కలమటకు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. తాజాగా కొత్తగా పార్టీ కమిటీలు ప్రకటించడంతో జిల్లా ప్రెసిడెంట్ గా మోదవలస రమేష్ కి పీఠం దక్కింది. దాంతో కలమట ఖాళీ అయిపోయారు.

టీడీపీతోనే అంటూ :

ఈ నేపధ్యంలో కలమట టీడీపీ నుంచి దూరం అవుతారు అని ప్రచారం సాగుతోంది. దాని మీద స్ట్రంగ్ గా ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను టీడీపీని వీడిపోను, రాజకీయాలను అంతకంటే వీడేది లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబానికి అరవై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉందని అన్నారు. పాతపట్నంలో ఎవరూ గెలవనన్ని సార్లు గెలిచిన తమది రాజకీయ కుటుంబం అన్నారు. తాను మళ్ళీ జనంలో ఉంటాను, క్యాడర్ తో మమేకం అవుతాను అని ఆయన ప్రకటించారు.

వర్గ పోరు స్టార్ట్ :

ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు కలమటకు మధ్య గ్యాప్ ఉందని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇప్పించింది జిల్లా టీడీపీలో పెద్ద నేతలు దాంతో పాటు అధినాయకత్వం కూడా మద్దతు ఇవ్వడంతో కలమటకు టికెట్ దక్కలేదు. ఇక నామినేటెడ్ పదవి కూడా ఏదీ దక్కలేదని ఆయన అనుచరుల్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పాతపట్నం నుంచే పోటీ చేయాలని కలమట నిర్ణయించుకున్నారు అని వారు అంటున్నారు. అయితే సొంత పార్టీలోనే ప్రత్యర్ధులు ఆయన వైసీపీలోకి వెళ్తారు అని ప్రచారం చేయడంతో కలమట స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అని అంటున్నారు. అయితే వైసీపీ కూడా ఆయనను తీసుకోదని అంటున్నారు. అక్కడ రెడ్డి శాంతి ఉన్నారని ఆమెకే టికెట్ కన్ ఫర్మ్ అని అంటున్నారు. మొత్తానికి కలమట తండ్రి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, తనయుడు మాత్రం ఒకే ఒకసారి గెలిచారు. మరి అరవయ్యేళ్ల రాజకీయాన్ని ఆయన ఎంతవరకూ కొనసాగిస్తారు అన్నదే చర్చగా ఉంది.

Tags:    

Similar News