కాకాణి వారి క‌ష్టాలు.. మామూలుగా లేవుగా ..!

సీనియర్ నాయకుడిగా ఆయన ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నది స్పష్టమవుతోంది.;

Update: 2026-04-28 03:45 GMT

సర్వేపల్లి నియోజకవర్గంలో ప‌లుమార్లు విజయం సాధించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే సొంత కుటుంబం మినహా ఇతరుల విషయంలో ఆయన పట్ల సానుకూలత సానుభూతి కనిపించడం లేదన్నది స్పష్టం అవుతుంది. నిజానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడమే కాదు వరుస విజయాలు కూడా దక్కించుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గాన్ని డెవలప్ చేసి ఉంటే అది ఆయనకు ప్లస్ అయ్యేది. కానీ దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఆయన గుప్పిట్లోనే ఉన్న నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక సమస్యలు వెంటాడుతున్నాయి.

సీనియర్ నాయకుడిగా ఆయన ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నది స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గంలో క్షేత్ర‌స్థాయిలో పర్యటిస్తున్నారు. మండలాల వారీగా గ్రామాల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ సమస్యలు అంటే కనీసం కరెంటు లేని పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్న‌ వందలాది ఇళ్లు దర్శనమిస్తున్నాయి.

అంతేకాదు రహదారులు డ్రైన్లు ఇంటి పట్టాలు ఇట్లా అసలు ఏ సమస్య కూడా పరిష్కారం కానీ పరిస్థితి కొన్ని మండలాల్లో ఉంది. ఇవన్నీ కాకానికి మరింత సెగ‌ పెడుతున్నాయి. నిజానికి ఆయన విజయం పరాజయం సంగతి పక్కనపెడితే సుదీర్ఘకాలం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసిన‌ప్పటికి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకపోవడం అనేది అత్యంత దారుణం అనే మాట వినిపిస్తోంది. ఈ కారణంగానే గత ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి పరాజయం పాలయ్యారు.

మరి ఇప్పుడైనా ఆయన పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా అంటే అటువంటి అవకాశమే లేదు అన్నది సోమిరెడ్డి చెబుతున్న మాట. ఆయన ఇటీవల మీడియా మిత్రులను సైతం క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్లి కాకాని గత 20 ఏళ్లలో ఏం చేశారో చూడండి అంటూ చూపించారు. అంతేకాదు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు వివరించారు. మెజారిటీ ప్రజలు కాకానిపై ఆగ్రహంతో ఉన్నారు. ఆవేదనతో ఉన్నారు. ఆయన పట్ల సింపతి ఎక్కడ కనిపించకపోవడం విశేషం. మరి ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కూడా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం కచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి పరాజయం కావడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News