కైలాసగిరికి కొత్త సొబగులు... .టూరిజం పరుగులే !

ఈ రెస్టారెంటు కానీ కాటేజీలు కానీ ఎకో ఫ్రెండ్లీగానే నిర్మాణం చేస్తారు అని అంటున్నారు ఇక నెచర్ కాటేజీలుగా వీటిని రూపొందిస్తారు అని చెబుతున్నారు. అలాగే ఇక్కడ భోజన శాల ఉంటుందని చెబుతున్నారు.;

Update: 2025-12-16 04:30 GMT

విశాఖలో కైలాసగిరి అన్నది ఒక అద్భుతమైన డెస్టినేషన్ గా అంతా చెబుతారు. మెట్ల మార్గం నుంచి వెళ్ళినా లేక బస్సులు ఇతర వాహనాలలో వెళ్ళినా ఆ ఎత్తు కొండలను చేరుకున్నాక అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదిస్తారు. అంతే కాదు కొండ పై నుంచి నీలి సంద్రాన్ని చూస్తూ ఎంతో పరవశించిపోతారు. రోజంతా అక్కడ ఉన్నా మనసు తీరదు అని అంతా అనుకుంటారు. అయితే ఇపుడు ఆ బాధ అక్కరలేదు, అసంతృప్తి అంతకంటే అవసరం లేదు, కూటమి ప్రభుత్వం విశాఖను టూరిజం హబ్ గా మార్చే క్రమంలో కైలాసగిరికి కొత్త హంగులు అద్దుతోంది. అందులో భాగంగా ఏకంగా కైలాసగిరి కొండ మీద కాటేజీల ఏర్పాటుకు అనుమతించింది.

ఇప్పటికే హంగులన్నీ :

ఇప్పటికే కైలాసగిరి వద్ద హంగులు అన్నీ ఒక్కోటిగా సమకూర్చే పనిలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి గాజు వంతెనను అందుబాటులో తెచ్చి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. అదే విధంగా టాయ్‌ ట్రైన్, స్కై సైక్లింగ్, జిప్‌ లైనర్ వంటివి కూడా అక్కడ ఉన్నాయి. సింగపూర్ కి చెందిన ఒక సంస్థతో మరిన్ని టూరిజం ప్రాజెక్టులు కైలాసగిరి మీద చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొండ మీద కాటేజీలు మరో ఎత్తుగా చెబుతున్నారు.

రెస్టారెంట్లు సైతం :

ఇక కైలాసగిరి మీద కాటేజీలతో పాటు భారీ రెస్టారెంట్లకు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇవి కనుక పూర్తి అయితే దేశ విదేశీ టూరిస్టులు అంతా కైలాసగిరి చేరుకుని అక్కడ రాత్రులు బస చేయడమే కాకుండా రెస్టారెంట్లలో సైతం ఆహార వసతి సదుపాయాలను పొందేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. దాంతో కైలాసగిరి మరింత ఎక్కువగా టూరిజం ట్రాఫిక్ తో సందడి చేస్తుంది అని అంటున్నారు.

ఎకో ఫ్రెండ్లీ సిస్టం లోనే :

ఈ రెస్టారెంటు కానీ కాటేజీలు కానీ ఎకో ఫ్రెండ్లీగానే నిర్మాణం చేస్తారు అని అంటున్నారు ఇక నెచర్ కాటేజీలుగా వీటిని రూపొందిస్తారు అని చెబుతున్నారు. అలాగే ఇక్కడ భోజన శాల ఉంటుందని చెబుతున్నారు. స్విమ్మింగ్ పూల్ తో పాటుగా ఏకంగా ఒకే సారి వంద మందికి పైగా కూర్చుని తినే విధంగా రివాల్వింగ్ రెస్టారెంట్ ని ఇక్కడ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఇక బీచ్ కే వ్యూ పాయింట్ మరో స్పెషాలిటీగా ఉండబోతోంది. ఇక్కడ ఒకేసారి అరవై మంది దాకా కలసి కూర్చునేలా డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు కనుక ఆచరణలోకి వస్తే కైలాసగిరి స్వరూపమే కాదు విశాఖ టూరిజం రూటే మారిపోతుంది అని అంటున్నారు. అయితే సీఆర్ జెడ్ నిబంధనల ప్రకారం కొండల మీద భారీ కట్టడాలు నిర్మించకూడదని పర్యావరణ వేత్తలు అంటున్నారు. మరి చూడాలి వారి ఆందోళనలు ఏ విధంగా ముందుకు సాగుతాయో.

Tags:    

Similar News