• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జూనియర్ కి మనశ్శాంతి లేదా...

జూనియర్ కి మనశ్శాంతి లేదా ?

| ఆయన లేటెస్ట్ గా ఉడిపి క్రిష్ణుడి కోవెలకు కుటుంబ సమేతంగా వెళ్ళారు. అది కాస్తా వైరల్ న్యూస్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-08-31 17:09 GMT

జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఒక క్రేజూ ఒక మోజూ. ఆయనే యంగ్ తరంగ్ కి ఒక బ్రాండ్ ఇమేజ్. ట్రిపుల్ ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాను స్క్రీన్ మీద నుంచి గ్లోబల్ స్క్రీన్ దాకా ఎదిగిపోయారు. ఆయన లేటెస్ట్ మూవీ దేవర కోసం జనాలు అంతా వెయిటింగ్. తాత సీనియర్ ఎన్టీఆర్ ని ముమ్మూర్తులా పోలిన ఈ జూనియర్ నటనలోనే కాదు అన్నింటా ఒక విశేషమే. ఆయన ప్రతీ కదలికా ఒక సెన్సేషనే.

ఆయన లేటెస్ట్ గా ఉడిపి క్రిష్ణుడి కోవెలకు కుటుంబ సమేతంగా వెళ్ళారు. అది కాస్తా వైరల్ న్యూస్ గా మారింది. ఈ సందర్భంగా జూనియర్ ని మీడియా చుట్టు ముట్టింది. కన్నడ మీడియాకు అనర్గళంగా జూనియర్ కన్నడంలోనే బదులిస్తూ మాట్లాడడం ఒక సంచలనం. ఇలా జూనియర్ మాట్లాడుతూంటే కన్నడ భాషను అమితంగా ప్రేమించే వారు అంతా ఆశ్చర్యం తో పాటు అలవికాని ఆనందాన్ని కూడా పొందారు.

ఈ సందర్భంగా ఉడిపి క్రిష్ణుడిని జూనియర్ ఏమి మొక్కుకున్నారు అన్నది అందరికీ ఆసక్తిని కలిగించే విషయమే కదా. దాన్నే మీడియా ఒక ప్రశ్నగా ఎక్కు పెట్టింది. దానికి జూనియర్ ఇచ్చిన జవాబు మనశ్శాంతి అని. దాంతో షాక్ తినడం కన్నడ మీడియా వంతే కాదు సామాజిక మాధ్యమాలలో దానిని వీక్షించిన ప్రతీ వారికీ షాక్ గానే అనిపించింది. అయితే ఆ వెంటనే జూనియర్ చిరునవ్వుతో దాన్ని లైట్ చేసేసారు. సర్వే జనా సుఖినోభవంతు అని కోరుకున్నాను అని చెప్పారు.

అయితే జూనియర్ మొదట చెప్పిన ఆన్సర్ చూస్తే ఆయన నిజంగా ఆలా చెప్పారా లేక సరదాకు అన్నారా అన్నదే చర్చగా ఉంది. జూనియర్ కి మనశ్శాంతి కరవు అయిందా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. టాప్ రేంజి సూపర్ స్టార్. టాప్ ఇండియా సూపర్ స్టార్స్ లో టాప్ టెన్ లో మంచి నంబర్ లో ఉన్న వాడు అయిన జూనియర్ కి మనశ్శాంతి లేకపోవడమా నెవెర్ అనే వారూ ఉన్నారు

అయితే అంతటి స్థాయిలో ఉన్నా ఏమో ఏమైనా ఉండొచ్చు అని అన్న వారూ ఉన్నారు. జూనియర్ సినీ రంగంలో అయితే తిరుగులేని స్థానంలోనే ఉన్నారు. ఆయనకు ఎంతో ఫ్యూచర్ కూడా ఉంది. మరి ఆయన ఇతర విషయాల్లలో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అన్నదే చర్చ. మరి కొద్ది గంటలలో తన బాబాయ్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ స్వర్ణోత్సవ సంబరాలు మొదలవుతున్న వేళ జూనియర్ నాకు మనశ్శాంతి కావాలి అని దేవుడిని కోరుకున్నాను అని అనడం తో ఇది మరో వైపు చర్చకు కూడా దారితీస్తోంది.

అసలు జూనియర్ బాబాయ్ మైల్ స్టోన్ ఈవెంట్ కి వస్తున్నారా లేదా అన్నది ఒక చర్చ అయితే ఆయనను పిలిచారా లేదా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా జూనియర్ కి మనశ్శాంతి లేకుండా చేసే విషయాలు సినీ సంబంధమైనవి అయితే కావు, ఇతర అంశాలే అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా జూనియర్ ఠక్కున చెప్పిన ఒకే ఒక్క ఆన్సర్ ఎన్నో సందేహాలకు తావు ఇస్తోంది.

Tags:    
  • Ntr 
  • Kannada 
  • Familytrip 
  • Udupikrishnatemple 
  • Viralnews 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS