వచ్చెన్ జూన్...అన్ని రేట్లూ పెంచేసే సీజన్ !

మే నెలలో సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. పెట్రోల్ ఏకంగా నాలుగు సార్లు పెంచారు.

Update: 2026-05-29 04:04 GMT

మే నెలలో సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. పెట్రోల్ ఏకంగా నాలుగు సార్లు పెంచారు. ఆ విధంగా లీటర్ మీద ఎనిమిది రూపాయలు పైగా ఎక్కువ చేశారు. డీజిల్ పెట్రోల్ మీద పెరిగిన ధరలు అక్కడితో ఆగవు. నిత్యావసరాల మీద కూరగాయలు కిరాణా మీద కూడా పడతాయి. ఇపుడు మెల్లగా ఆ ప్రభావం అంతా జూన్ నెలలో కనిపిస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ మీద 50 రూపాయలు పెంచేశారు. జూన్ లో కూడా మరోసారి పెంపుదల ఉంటుందని అంటున్నారు. ఇంకా అనేక రకాలుగా ధరలు పెరిగి జూన్ కొంప ముంచే సీజన్ అయ్యేలా ఉందని అంటున్నారు.

గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో :

గత నాలుగు నెలలుగా సాగుతున్న గల్ఫ్ ప్రత్యక్ష పరోక్ష యుద్ధం ప్రభావం భారత్ కి మే నెల మధ్య నాటికి కానీ తెలిసింది కాదు. దానికి కారణం దేశంలో అయిదు రాష్ట్రాలకు సార్వత్రిక ఎన్నికలు జరగడం. ఆ ఎన్నికలు పూర్తి అయి ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాక అపుడు తాపీగా జనం మీద ఈ భారాలు మోపారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అంటున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు పెరిగినా కూడా పెట్రోల్ మీద పెంపుతో చమురు కంపీనలకు నష్టాలు ఇంకా పూడ్చడంలేదని అంటున్నారు. దాంతో మరో 20 రూపాయల దాకా పెంచుకుంటూ పోతేనే తప్ప కుదిరే వ్యవహారంగా కనిపించడం లేదని అంటున్నారు. అంటే జూన్ లో కూడా విడతల వారీగా పెట్రో ధరలు పెరిగి సగటు జీవితాల మీద పెను ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు.

ఎల్పీజీ గ్యాస్ సైతం :

ఇక రెండవ విడతగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయని అంటున్నారు. పెంచిన యాభై రూపాయలతోనే భారం తట్టుకోలేమని భావిస్తున్న మధ్యతరగతి పేద వర్గాలకు ఇది గుదిబండగానే మారుతుందని అంటున్నారు. దాంతో జూన్ నెల వస్తూనే గ్యాస్ బండ మంట పెట్టడం ఖాయమని ఫిక్స్ కావాల్సిందే అని అంటున్నారు. దాంతో వంటింటి బజ్డెట్ మొత్తం పూర్తిగా తల్లకిందులు అవుతుందని కూడా అంటున్నారు. ఈ పెరుగుదలతో పాతు యూపీయే పేమెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకుని వస్తారు అని అంటున్నారు అలాగే పాన్ కార్డు విషయంలో కూడా కొత్త నిబంధనలు అలాగే ఏటీఎం చార్జీల పెరుగుదల వంటివి ఉండబోతున్నాయని అంటున్నారు.

సగటు జీవి టార్గెట్ :

మరి ఏటీఎంల నుంచి నగదుని ఉచితంగా తీసుకునే పరిమితిని తగ్గించేందుకు కూడా కొన్ని బ్యాంకులు సవరణలు చేయవచ్చు అని అంటున్నారు. అదే జరిగితే సామాన్యుడికే ఇబ్బంది అని అంటున్నారు. ఇలా చూస్తూ పోతే జూన్ నెలలో మరిన్ని ఆర్ధికపరమైన అంశాలతో చేయబోతున్న నిర్ణయాలు నేరుగా సగటు జీవినే టార్గెట్ చేయనున్నాయని అంటున్నారు. మరి ఇప్పటికే పెట్రోల్ పెరిగింది ఇంకా పెంచుతారా అంటే తప్పదు అన్న మాటలు వినవస్తున్నాయి. అలాగే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో అదే ఆన్సర్ వస్తోంది. ఇలా పెరిగిన వాటితో ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతుందని ఫలితంగా సగటు జీవి కష్టాలు ఇంకా పెరుగుతాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News