‘బీజేపీ మానవత్వాన్ని అమ్మేసింది’... కాంగ్రెస్ దాడికి కారణం ఈ వైరల్ వీడియో!

అవును.. వడోదరలో సర్దార్@150 ఐక్యతా మార్చ్ సందర్భంగా భద్రతా సిబ్బంది స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయినప్పటికీ.. జేపీ నడ్డా తన ప్రసంగాన్ని కొనసాగించారు.;

Update: 2025-11-30 17:58 GMT

గుజరాత్ లోని వడోదరలో శనివారం 'సర్ధార్@150 ఐక్యతా మార్చ్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది ఒకరు స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. అయినప్పటికీ జేపీ నడ్డా తన ప్రసంగాన్ని కొనసాగించారనే విషయం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది!

అవును.. వడోదరలో సర్దార్@150 ఐక్యతా మార్చ్ సందర్భంగా భద్రతా సిబ్బంది స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయినప్పటికీ.. జేపీ నడ్డా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సమయంలో స్టేజ్ పై ఉన్న మిగిలిన వారూ స్పందించలేదు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్, తోటి గార్డులు వచ్చి బాధితుడికి సహాయం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ గట్టిగా తగులుకుంది! ఈ సందర్భంగా... బీజేపీ మానవత్వాన్ని అమ్మేసిందంటూ ఘాటు వ్యాఖ్యలే చేసింది. ఇందులో భాగంగా... గుజరాత్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ అద్య్క్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో ఒక భద్రతా సిబ్బంది స్పృహ కోల్పోయి పడిపోయారని.. అయినప్పటికీ నడ్డా తన ప్రసంగాన్ని ఆపలేదని తెలిపింది.

ఇదే సమయంలో... వేదికపై ఉన్న బీజేపీ నాయకులు కూడా సహాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. అందువల్ల ఆలోచించండి.. తమ ముందు పడిపోయిన వ్యక్తినే పట్టించుకోని బీజేపీ నాయకులు.. మీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సంక్షోభం, రోజువారీ పోరాటాల గురించి ఎలా పట్టించుకుంటారు? అని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా ప్రజలను ప్రశ్నించింది.

కాగా ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన నడ్డా.. సర్దార్ పటేల్ ను చరిత్ర నుంచి తుడిచిపెట్టదానికి కాంగ్రెస్ గణనీయమైన ప్రయత్నాలు చేసిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పటేల్ కు నివాళిగా నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఖర్చు, అవసరాన్ని కూడా ఆ పార్టీ ప్రశ్నించిందని అన్నారు. సర్దార్ పటేల్ ను గుర్తుంచుకోవడాన్ని ఆ పార్టీ కోరుకోవడం లేదని నడ్డా ఆరోపించారు!



Tags:    

Similar News