• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తుర్కియే వర్సిటీతో డీల్...

తుర్కియే వర్సిటీతో డీల్ రద్దు చేసుకున్న జేఎన్ యూ!

| తాజాగా తుర్కియేలోని ఇనొను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న ఎంవోయూను నిలిపివేస్తున్నట్లుగా ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్ యూ (జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) తాజాగా ప్రకటించింది.

By - Tupaki Desk
Update: 2025-05-15 05:30 GMT

ఆపరేషన్ సిందూర్ వేళ.. పాకిస్తాన్ కు బాహాటంగా మద్దతు పలికి.. వారికి సాయం చేసే అంశంలో భారత్ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరించిన తుర్కియే (టర్కీ) మీద భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరికి వారు తుర్కియే ఉత్పత్తుల్ని స్వచ్ఛందంగా బాయ కాట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించటంతో.. ఈ ప్రచారం అంతకంతకూ విస్త్రతం కావటమే కాదు.. చివరకు ప్రతిష్ఠాత్మక సంస్థలు సైతం అదే బాటలో నడుస్తున్నాయి.

తాజాగా తుర్కియేలోని ఇనొను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న ఎంవోయూను నిలిపివేస్తున్నట్లుగా ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్ యూ (జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) తాజాగా ప్రకటించింది. భారత - తుర్కియే దేశాల మధ్య ఇటీవల మూడేళ్ల కాల వ్యవధికి చెందిన విద్యాపరమైన ఒప్పందాలు జరిగాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా జేఎన్ యూ వెల్లడిచింది. దేశ భద్రత ద్రష్ట్యా ఇనొను వర్సిటీతో కుదుర్చుకున్న ఎంవోయూను తాము నిలిపివేసినట్లుగా చెబుతున్నారు.

గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అధ్యాపకులు.. విద్యార్థుల మార్పిడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. వాటన్నింటిని తక్షణం నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తుర్కియేలోని మలట్యాలో ఇనొను విశ్వవిద్యాలయం ఉంది. విభిన్న సాంస్క్రతిక పరిశోధనలు.. విద్యార్థుల సామర్థ్యాల్ని పెంచేలా జేఎస్ యూ - ఇనొను వర్సిటీ మధ్య ఎంవోయూ కుదురింది. తాజా పరిణామాలను చూస్తే.. రానున్న రోజుల్లో ఆ దేశంతో భారత వాణిజ్య సంబంధాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ప్రజలే కాదు.. భారత ప్రభుత్వం కూడా తుర్కియే కు వ్యతిరేకంగా జట్టు కట్టే వ్యూహాల్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

Tags:    
  • BoycottTurkey 
  • IndiaFirst 
  • JNUDecision 
  • OperationSindoor 
  • StandWithIndia 
  • TurkeyMoUSuspended 
  • AcademicBoycott 
  • TurkishUniversity 
  • SupportIndianArmy 
  • NoTurkeyProducts 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS