లోక సక్సెస్.. వార్నింగ్ ఇచ్చిన దృశ్యం డైరెక్టర్..!

దృశ్యం సీరీస్ లతో నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ జీతు జోసెఫ్. మోహన్ లాల్ తో ఆయన చేసే ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.;

Update: 2025-09-16 05:36 GMT

దృశ్యం సీరీస్ లతో నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ జీతు జోసెఫ్. మోహన్ లాల్ తో ఆయన చేసే ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మిరేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో రీసెంట్ సూపర్ హిట్ సినిమా లోక గురించి ప్రస్తావించారు. మలయాళం నుంచి వచ్చిన సూపర్ హీరో సినిమా లోక చాప్టర్ 1 చంద్ర. ఈ సినిమా సక్సెస్ మలయాళ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. డామెరిక అరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించారు.

సూపర్ హీరో సినిమాలతో కొత్త క్రేజ్..

కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఉమెన్ సూపర్ హీరో సినిమాలతో కొత్త క్రేజ్ తీసుకొచ్చింది లోక. ఐతే ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉండగా మలయాళ మేకర్స్ కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు డైరెక్టర్ జీతు జోసెఫ్. లోక సినిమా సక్సెస్ అయ్యింది కదా అని ఇక మీదట అన్నీ కూడా అలాంటి తరహా సినిమాలు చేస్తే మాత్రం రిస్క్ లో పడినట్టే అని అన్నారు. లోక సక్సెస్ అంటే ఆ సినిమాకు అలా కుదిరింది. కానీ అన్నిటికీ అలా కుదరాలని లేదని అన్నారు జీతు జోసెఫ్.

అందరికీ అన్ని సినిమాలు చేయాలని ఉంటుంది. కొన్ని జోనర్ సినిమాలు కొన్ని సమయాల్లో మాత్రమే వర్క్ అవుట్ అవుతాయి. అందుకే లోక సినిమా లాంటి ప్రయత్నాలు మళ్లీ మళ్లీ చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు జీతు జోసెఫ్. మామూలుగా ఏ పరిశ్రమలో అయినా అంతే.. ఒక సినిమా హిట్ అయితే అదే తరహాలో వరుస సినిమాలు చేస్తుంటారు. ఒకటి రెండు హిట్ అయినా తర్వాత అన్నీ ఫ్లాపులు అవుతుంటాయి. ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టేస్తుంది.

సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం 3..

అందుకే ముందే హెచ్చరిస్తూ మలయాళ మేకర్స్ కి తన సజెషన్ ఇస్తున్నారు జీతు జోసెఫ్. మోహన్ లాల్ తో సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం 3 కూడా చేస్తున్న ఆయన ఈసారి దృశ్యం 3 కాస్త డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. దృశ్యం 1 అండ్ 2 సినిమాలకు భిన్నంగా పార్ట్ 3 ఉంటుందని అన్నారు జీతు జోసెఫ్. అదేంటో జీతు జోసెఫ్ సినిమాలే కాదు ఆయన కామెంట్స్ కూడా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తుంటాయని అంటున్నారు.

జీతు జోసెఫ్ మిలేజ్, దృశ్యం 3 సినిమాలతో మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించబోతున్నారు. దృశ్యం సీరీస్ లతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన జీతు జోసెఫ్ లోక సినిమాపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News