34 ఏళ్ల వయసు.. 317 కిలోల బరువు.. హోల్టన్ మృతి!

అవును... బ్రిటన్‌ లో అత్యంత బరువైన వ్యక్తి జేసన్ హల్టన్ మరణించాడు.

Update: 2024-05-06 10:17 GMT

బ్రిటన్‌ లో అత్యంత బరువైన వ్యక్తి జేసన్ హల్టన్ మరణించాడు. జేసన్ హల్టన్ శరీరంలోని చాలా అవయవాలు విఫలమయ్యాయని, ఎంతగా ప్రయత్నించినప్పటికీ అతన్ని రక్షించలేకపోయామని వైద్యులు చెప్పారు. వాస్తవానికి.. జేసన్ చనిపోతాడని వైద్యులు వారం రోజుల క్రితమే చెప్పారని.. కిడ్నీలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయాయని.. ఫలితంగా అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించిందని అతడి తల్లి లీసా వెల్లడించారు.

అవును... బ్రిటన్‌ లో అత్యంత బరువైన వ్యక్తి జేసన్ హల్టన్ మరణించాడు. ఇతని వయసు కేవలం 34 సంవత్సరాలు కాగా... వారం క్రితమే తన 34వ పుట్టినరోజు జరుపుకున్నారని తెలుస్తుంది. ఇక, జేసన్ బరువు 318 కిలోలు కావడం గమనార్హం. జేసన్ ను ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో రాయల్ సర్రే కౌంటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతని తల్లి దగ్గరుండి చూసుకుంది!

అధిక కొవ్వు కారణంగా జేసన్ అవయవాలు పనిచేయడం మానేశాయని.. కిడ్నీ డయాలసిస్ చేస్తున్నారని.. ఈ క్రమంలోనే అతని అన్ని అవయవాలు క్రమక్రమంగా విఫలమయ్యాయని చెబుతున్నారు. జేసన్ ఒక సాధారణ మనిషి కంటే సుమారు 4 రెట్లు ఎక్కువ తింటాడట. అంటే రోజుకు సుమారు 10,000 కేలరీలు ఆహారం తీసుకుంటారని అంటున్నారు.

ఈ క్రమంలోనే 2020 సంవత్సరంలో అతడు పడిపోయాడు. ఆ సమయంలో సుమారు 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, ఇంజనీర్లతో కూడిన బృందం అతన్ని అపార్ట్మెంట్‌ లోని మూడవ అంతస్తు నుండి కొన్ని గంటల పాటు కష్టపడి క్రేన్ సహాయంతో విమానంలో ఎక్కించారు.

కాగా... జేసన్ హల్టన్ మొదట్లో సాదారణ బరువే ఉన్నప్పటికీ.. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని చెబుతున్నారు. మనోవేదనతో డైట్ పై దృష్టి పెట్టకుండా ఏది బడితే అది తినేసేవాడని.. దీంతో భారీగా బరువు పెరిగారని చెబుతున్నారు!

Tags:    

Similar News