జనసేనకు 27/3 ఖాయమైందా ?

రాబోయే ఎన్నికల్లో జనసేనకు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీచేయటం ఖాయమైందా ? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2024-02-21 04:32 GMT

రాబోయే ఎన్నికల్లో జనసేనకు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీచేయటం ఖాయమైందా ? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 30 అసెంబ్లీలు, 3 లోక్ సభ స్ధానాలను జనసేనకు కేటాయించడానికి చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచుం. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణే చెప్పారట. రాజమండ్రి నియోజకవర్గంలో తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్యనేతలతో పవన్ సమావేశమైన విషయం తెలిసిందే. వివిధ నియోజకవర్గాల్లో పార్టీ బలంపై సమీక్ష నిర్వహించారు.

పనిలోపనిగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. అలాగే రాజానగరంలో కూడా జనసేన పార్టీయే పోటీ చేస్తుందని చెప్పారు. అయితే అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. ఇదే సందర్భంలో నేతలు అడిగిన ప్రశ్నలకు పవన్ జవాబిస్తు మొత్తంమీద 30 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోందని చెప్పారట. దాంతోనే జనసేనకు చంద్రబాబు 30 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్ధానాలను కేటాయించారనే చర్చ పెరిగిపోతోంది. ఇంతకుముందు జనసేనకు చంద్రబాబు 25 అసెంబ్లీలు, 2 పార్లమెంటు సీట్లను కేటాయించటానికి అంగీకరించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Read more!

20 నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసే స్ధానాలు ఖరారయ్యాయని, మరో ఐదు సీట్లను ఇవ్వచ్చని జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే జరిగిన ప్రచారానికన్నా ఐదు అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంటు సీటు పెరిగినట్లు అర్ధమవుతోంది. పవనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పినట్లు జనసేన నేతలు చెబుతున్నారు కాబట్టి నిజమే అయ్యుండచ్చు. మరిది నిజమే అయితే పొత్తు కుదిరితే బీజేపీకి ఎన్నిసీట్లు కేటాయిస్తారనే ప్రశ్న మొదలైంది.

బీజేపీకి 12 అసెంబ్లీ సీట్లు, 5 లోక్ సభ నియోజకవర్గాలను కేటాయించటానికి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు పవన్ చెప్పారట. బీజేపీతో చంద్రబాబు, పవన్ భేటీ జరిగితే అన్నీ విషయాలు బయటకు వస్తాయని అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు-పవన్ మాట్లాడుకున్నారు. అలాగే ఢిల్లీలో అమిత్ షా-చంద్రబాబు మాట్లాడుకున్నారు. తొందరలోనే అమిత్-చంద్రబాబు-పవన్ జాయింట్ మీటింగ్ జరగబోతోంది. జాయింట్ మీటింగ్ జరిగి సీట్లపై చర్చిస్తే కాని సీట్ల సర్దుబాటు ప్రక్రియ మొదలైనట్లు కాదు. అప్పుడే ఏ పార్టీ ఎన్నిసీట్లు అడుగుతోంది ? ఎన్ని సీట్లు ఫైనల్ అయ్యాయనే విషయంలో క్లారిటి వస్తుంది.

Tags:    

Similar News