ప్రకాశ్ రాజ్ కు జనసేన కౌంటర్: ''అమ్ముడుపోవడం అంటే ఇదేనా?''
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శలకు జనసేన గట్టి కౌంటర్ ఇచ్చింది.;
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శలకు జనసేన గట్టి కౌంటర్ ఇచ్చింది. "అమ్ముడుపోవడం అంటే ఇదేనా?" అంటూ ప్రకాశ్ రాజ్ పాత వీడియోను పంచుకుంటూ జనసేన శతఘ్ని ప్రశ్నించింది.
హిందీ భాషపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. "మన మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడానికి సరిపోతుంది. కానీ ఇంటి గేటు దాటిన తర్వాత మన రాజ్యభాష హిందీ" అనే ఆయన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. "ఈ రేంజ్‌కి అమ్ముడుపోవడమా... ఛీ ఛీ..." అంటూ X లో వ్యాఖ్యానించారు.
- "అమ్ముడుపోవడం అంటే ఇది కాదు" జనసేన శతఘ్ని రిప్లై
ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యపై జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా వింగ్ అయిన "జనసేన శతఘ్ని" తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ప్రకాశ్ రాజ్ గతంలో మాట్లాడిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ జనసేన శతఘ్ని ప్రశ్నించింది. "మాతృభాషను కాపాడుకుంటూనే ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం అమ్ముడుపోవడం కాదు. అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పైతే, మీరు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు ఎలా చేస్తారు? ఈ రోజు ఇలా మాట్లాడే స్థాయికి మీరు ఎలా వచ్చారు?" అని ప్రశ్నించింది.
- ప్రకాశ్ రాజ్‌కి ఈ పాఠం నేర్పడమేంటి?
జనసేన షేర్ చేసిన ప్రకాశ్ రాజ్ పాత వీడియోలో ఆయన స్వయంగా ఇలా చెప్పారు. "మనకు మా మాతృభాషంటే గౌరవం ఉండాలి. కానీ ఇతర భాషలను కూడా నేర్చుకోవాలి. భాషలు వేరు కావు, మనల్ని విభజించకూడదు" అంటూ అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన తాజా విమర్శలకు విరుద్ధంగా ఉండటంతో జనసేన అతనిపై "అమ్ముడుపోవడం అంటే ఇదేనా?" అంటూ ప్రశ్నించింది. ఒకవైపు భాషల మీద ప్రేమ, సంస్కృతుల గౌరవం గురించి మాట్లాడుతూ మరోవైపు రాజకీయ విభేదాల కోసం అదే అంశంపై విమర్శలు చేయడాన్ని జనసేన ప్రశ్నిస్తోంది.
భాషపై విమర్శలు, రాజకీయం చేయడంలో ప్రస్తుత వివాదం మరో ఉదాహరణగా నిలిచింది. వ్యక్తులు తమ గత వ్యాఖ్యల్ని విస్మరించడం, రాజకీయ పరిస్థితులను బట్టి మాటలు మార్చడం నిత్యకృత్యంగా మారింది. జనసేన, పవన్ కళ్యాణ్‌పై వచ్చిన విమర్శల్ని ఈ విధంగా తిప్పికొట్టిన పార్టీ, ప్రకాశ్ రాజ్‌కు రాజకీయ లక్ష్యాల కోసమే ఈ మాటలంటూ చెబుతోంది.