• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు సున్నా అని,...

చంద్రబాబు సున్నా అని, దాని పక్కన ఎన్ని బోడి పార్టీలు కలిసినా!

| చంద్రబాబు సున్నా అని, దాని పక్కన ఎన్ని బోడి పార్టీలు కలిసినా దాని విలువ సున్నానే అంటూ సీఎం జ‌గ‌న్‌ సెటైర్లు వేశారు.

By - Tupaki Desk
Update: 2024-03-11 05:19 GMT

వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోన త్వరలో విడుదల చేస్తామని ఏపీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చేయగలిగిందే చెబుతాం, చెప్పిన ప్రతి ఒక్కటీ చేసి తీరుతామని, జగన్ మాట ఇచ్చాడంటే తగ్గేదే లేదు అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన నాలుగో సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చెప్పింది ఏదీ చేయలేదని, మేనిఫెస్టోను ఏనాడూ అమలు చేయని నేతగా నిలిచారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మ్యానిఫెస్టోకు శకుని చేతిలోని పాచికలకు తేడాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సున్నా అని, దాని పక్కన ఎన్ని బోడి పార్టీలు కలిసినా దాని విలువ సున్నానే అంటూ సీఎం జ‌గ‌న్‌ సెటైర్లు వేశారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే పొత్తుగా ఏర్పడి ఇచ్చిన హామీలు.. రైతులకు రుణమాఫీపై తొలి సంతకం, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయడం, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీ పేరిట రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేయడం, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే జాబ్ వచ్చే వరకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇలా చెప్పిన ఏ విషయాన్ని అమలు చేయని వ్యక్తులు ఆ కూటమిలో ఉన్నారని జగన్ అన్నారు.

అధికారంతో ప్రజల్ని దోచుకుని, పంచుకునేందుకు ఎన్నికల్లో నెగ్గాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తాము కరోనా కష్ట సమయంలోనూ సాకులు చూపకుండా మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ పథకాలు అందిచ్చామన్నారు. 2 లక్షల 65 వేల కోట్లు బటన్ నొక్కగానే నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి చేరాయని తెలిపారు. పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని జగన్ పేర్కొన్నారు.

2024 ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వం సైతం.. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన 8 పథకాలను తరువాత కూడా కొనసాగించాల్సి ఉంటుందన్నారు. 66 లక్షల పెన్షన్లకు రూ.24 వేల కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్ రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రూ.4,600 కోట్లు, ఆరోగ్యశ్రీ, 104, 108 కచ్చితంగా అమలు చేయాలి. మరో రూ.4,400 కోట్లు, విద్యా దీవేన, వసతి దీవెన కింద రూ.5 వేల కోట్లు..ఇలా ఈ పథకాలు ఎవరూ టచ్ చేయలేరని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

``మేనిఫేస్టోలో 90శాతం అమలు చేశాం. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండా ఉంటా, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి పేదకు మంచి చేశాం. రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఇంటికి మంచి జరిగింద``న్నారు. ప్రతి గ్రామంలో మంచి జరిగి నేరుగా రూ.20కోట్లు ప్రతి గ్రామానికి చేరాయని, అందుకే వై నాట్ 175 అని, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా తగ్గకూడదని జ‌గ‌న్ మ‌రోసారి తేల్చి చెప్పారు.

Tags:    
  • Andhrapradesh 
  • Ycp 
  • Ysjaganmohanreddy 
  • Bjp 
  • Tdp 
  • Janasenaparty 
  • JanasenaTDPAlliance 
  • APElections 
  • Chandrababu 
  • Pawankalyan 
  • Politicalnews 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS