షర్మిళకు డిపాజిట్ కూడా రాదనేదే నా బాధ:... జగన్ సంచలన వ్యాఖ్యలు!

ఈ సమయంలో కడప లోక్ సభ స్థానంలో షర్మిళ గెలుపోటములపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-29 13:50 GMT

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ కూటమితో పాటు.. వైఎస్ జగన్ వర్సెస్ షర్మిళ చర్చ కూడా బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మిగిలిన నియోజకవర్గాల సంగతి కాసేపు పక్కనపెడితే... కడప లోక్ సభ స్థానంలో ఏపీ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల పోటీ చేస్తుండటం.. ఆమెపై పోటీకి వైఎస్ అవినాష్ ని జగన్ నిలబెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో కడప లోక్ సభ స్థానంలో షర్మిళ గెలుపోటములపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... "సిద్ధం", "మేమంతా సిద్ధం" అంటూ ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలను తెరపైకి తెచ్చిన జగన్.. ఇప్పుడు రోజుకి మూడు సభలు పెడుతూ అవిరాంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సభల్లో జగన్ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి నేతలు నాడు ఏ మేరకు అమలు చేశారో ఆలోచించాలని.. నాటి రోజులను ప్రజలకు గుర్తుచేస్తున్నారు.

ఈ సందర్భంగా తాజాగా ఒక జాతీయ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్. ఈ సందర్భంగా సంచలన విషయాలు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మోడీతో ఉన్న బంధం, కడపలో షర్మిళ పోటీ, అందులో రేవంత్ - చంద్రబాబు పాత్ర, ఆ స్థానంలో షర్మిళకు వచ్చే ఓట్లు.. మొదలైన విషయాలపై స్పందించారు జగన్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read more!

ఇందులో భాగంగా... మొడీతో తనకున్నది కేంద్ర ప్రహుత్వం - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం మాత్రమే అని స్పష్టం చేసిన జగన్... ఇప్పుడు వారు రాజకీయంగా తమ ప్రత్యర్థులని గుర్తుచేశారు. ఇప్పుడు మోడీ, చంద్రబాబుతో జతకట్టారని.. వారంతా తమ ప్రత్యర్థులని అన్నారు. ఇదే సమయంలో.. రానున్న రోజుల్లో తమ సహాయం మోడీకి ఉంటుందా, ఉండదా అనే ఊహాజనిత విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇదే క్రమంలో... కడప లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిళ పైనా జగన్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... షర్మిళ పోటీ చేయడంపై తనకు బాధ లేదని.. కానీ, ఆమె డిపాజిట్ కోల్పోతుందనే బాధ ఎక్కువగా ఉందని అన్నారు. ఇదే సమయంలో.. ఆమె చేస్తోంది కరెక్ట్ కాదని తెలిపారు.

ఇందులో భాగంగా... అక్రమ కేసుల ఛార్జిషీట్లలో తన తండ్రి వైఎస్సార్ పేరు, తన పేరు చేర్చింది కాంగ్రెస్, టీడీపీలే అని అన్నారు. ఇదే సమయంలో... ఇప్పుడు తన చెల్లెలు, కాంగ్రెస్ పార్టీలను రేవంత్ ద్వారా నడిపిస్తున్నది చంద్రబాబే అని జగన్ సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేది చంద్రబాబు రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న పార్టీ అని జగన్ వ్యాఖ్యానించారు! దీంతో.. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!

Tags:    

Similar News