జగన్ అన్న మాటల్ని తూచా తప్పకుండా ఫాలో చేసిన ఏపీ ప్రజలు!

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నికల ప్రచార వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటా తాజా ఎన్నికల ఫలితాల వేళ.. రివర్పు కొట్టిన పరిస్థితి.;

Update: 2024-06-05 04:44 GMT

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నికల ప్రచార వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటా తాజా ఎన్నికల ఫలితాల వేళ..రివర్స్ కొట్టిన పరిస్థితి. అన్నింటికి మించి.. ఏపీ ఎన్నికల ఫలితాలు యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిందన్న మాట విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. నిజమే.. 175 స్థానాలకు అధికార పక్ష హోదాలో బరిలోకి దిగిన వైసీపీ.. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోవటంతో యావత్ దేశం ఒక్కసారిగా ఏపీ వైపు చూసింది.

గత ఎన్నికల్లో 151 స్థానాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన వైసీపీ.. ఐదేళ్లు గడిచేసరికి.. నాడు విపక్ష తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లలో సగం కూడా రాకపోవటం దేనికి నిదర్శనం? అన్నట్లుగా ఫలితాలు వెల్లడయ్యాయి. మంచి పనులు చేసిన వారిని ఎన్నుకోవాలని.. మీ ప్రేమ.. అభిమానం.. అప్యాయతలకు అర్హత ఉన్న వారికి ఓటేయాలన్న జగన్ మాటల్ని ఏపీ ప్రజలకు ఇలా అర్థమయ్యాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఏమైనా.. ఏపీ ప్రజలు క్లారిటీగా ఇచ్చిన తీర్పు హాట్ టాపిక్ గా మారింది. మోతాదు మించిన మాటల్ని తాము భరించలేమని.. రాజకీయం చేయాల్సిందే కానీ డెవలప్ మెంట్ కూడా అవసరమన్న విషయాన్ని తాజా ఫలితంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టం చేశారని చెప్పాలి. సంక్షేమం ఉండాల్సిందే.. అదే సమయంలో డెవలప్ మెంట్ లేని రాష్ట్రంతో ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని తమ ఓటుతో చెప్పేశారు. సంక్షేమంతో పాటు.. డెవలప్ మెంట్ రెండు రెండు చక్రాల మీదిరి పరుగులు తీయాల్సిన ఆవశ్యకతను ఏపీ ప్రజలు గుర్తించాలని చెప్పాలి. ఏమైనా.. ఏపీ ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు.. జగన్ మాటల్ని తెలుగోళ్లు గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News