• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజ్యసభ ముగ్గురు...

రాజ్యసభ ముగ్గురు అభ్యర్థులనూ అలా ఫైనల్ చేసిన జగన్!

| అవును... రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-07 07:10 GMT

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుని చాలా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పు, చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పటికే ఆరు జాబితాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం జగన్. ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభ సభ్యులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

అవును... రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయని అంటున్నారు. ఇందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఈ ముగ్గురిలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం, ఒకరు ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు కాగా... జగన్ సామాజిక సమీకరణాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయంలో ఇప్పటికే జగన్ ఒక క్లారిటీకి, కన్ క్లూజన్ కు వచ్చారని తెలుస్తుంది. ఇందులో భాగంగా బుధ, లేదా గురువారం నాడు వీరి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 8 న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో... ఆరోజు మధ్యాహ్నం అసెంబ్లీలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారని సమాచారం.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయాన్ని నోటిఫికేషన్ కు ముందే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. వాస్తవానికి ఇప్పుడు తెరపైకి వచ్చిన ముగ్గురు పేర్లలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు గతంలోనే ఖరారు చేశారు. అయితే, మూడో వ్యక్తికి సంబంధించి జగన్ గతకొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు.

మరోపక్క రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ సైతం ఒక అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉందని అంటున్నారు. అయితే... ఆ అభ్యర్థి పేరు ఇంకా స్పష్టం కాలేదని తెలుస్తుంది. దీంతో... గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, క్రాస్ ఓటింగ్ జరగకుండా ముందస్తుగానే వైసీపీ అలర్ట్ అయ్యిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే వైసీపీ రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవబోతున్నారు.





 


Tags:    
  • Jganmohanreddy 
  • Rajyasabha 
  • Yvsubbareddy 
  • Raghunadreddy 
  • Gollababurao 
  • Tdp 
  • Jansena 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS