జగన్ కొత్త స్లోగన్...క్లిక్ అవుతుందా ?

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త స్లోగన్ అందుకున్నారు. ఆయన లేటెస్ట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో ఆ స్లోగన్ వాడారు.

Update: 2026-07-06 03:29 GMT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త స్లోగన్ అందుకున్నారు. ఆయన లేటెస్ట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో ఆ స్లోగన్ వాడారు. అయితే అది కేవలం ఆ మీడియా మీటింగుకు లేక యాధాలాపంగా అని ఊరుకున్నారో అని అంతా అనుకున్నారు. కానీ మరోసారి తన ట్వీట్ ద్వారా అదే స్లోగన్ జగన్ కంటిన్యూ చేశారు. దాంతో జగన్ దానితోనే జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారా అన్న చర్చ మొదలైంది. జగన్ ఈ కొత్త స్లోగన్ ఏమిటి అంటే హే రాం..సేవ్ ఏపీ. జగన్ అధికార కూటమి ప్రభుత్వం మీద రొటీన్ గానే విమర్శలు చేస్తున్నారు. అయితే చివరాఖరులో మాత్రం హే రాం. సేవ్ ఏపీ అంటున్నారు.

వాటిని ఫోకస్ చేస్తూ :

జగ్న్ చంద్రబాబు పాలనపై హే రాం..సేవ్‌ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అంటున్నారు అంటే ఆయన పాలన తీరుని జనంలో ఫోకస్ చేయడానికి అని అంటున్నారు. తన విమర్శల కంటే ఈ స్లోగన్ బలమైనదిగా పదునైనదిగా ఆయన భావిస్తునారు. అంతే కాదు ఏపీలో పాలన ఇలా ఉంది హే రాం సేవ్ అంటూ జగన్ ఇస్తున్న పిలుపు జనంలో చర్చకు వచ్చేలా చూడాలన్నది వ్యూహంగా ఉంది అని అంటున్నారు. ఇక లేటెస్ట్ ట్వీట్ లో చూస్తే జగన్ ఏపీలో పోలీస్ యంత్రాంగం పని తీరు మీద తీవ్ర విమర్శలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన ధోరణిలో ఉందని ఆయన మండిపడ్డారు.

హోం శాఖ మీదనే :

ఇక ఏపీలో హోం శాఖనే జగన్ టార్గెట్ చేసినట్లుగా ఉంది. ఏపీలో ప్రశ్నించే వారినే అణచివేస్తున్నారు అన్నది ఆయన విమర్శగా కనిపిస్తోంది. అంతే కాదు చిన్నారుల మిస్సింగ్ అయినా దర్యాప్తులో వేగం లేదని తుని బాలిక జాహ్నవి ఇష్యూని ముందుకు తెచ్చారు. అలాగే ఒక గిరిజన మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా అరెస్టులు లేవని, సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఇదే సందర్భంగా ఆయన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ అంశాన్ని గుర్తు చేశారు. శవాన్ని మాయం చేశారు సాయిక్రిష్ణ తల్లి అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాల్లేవని జగన్ విమర్శించారు. ఇదే సందర్భంగా క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసు, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్‌, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసు, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ట్వీట్లతో నేనా :

ఇదిలా ఉంటే జగన్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ మధ్యలో సాయి క్రిష్ణ ఫ్యామిలీని అలాగే క్రాంతి కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు. వైసీపీ నేతల చేత ఈ విషయాల మీద మీడియా సమావేశాలు పెట్టించారు. అయితే జగన్ ఇంతటి వరకే పరిమితం అవుతూ ట్వీట్లతోనె సరిపెడతారా లేదా సేవ్ ఏపీ అని మరేదైనా యాక్షన్ ప్లాన్ ఉందా అన్న చర్చ సాగుతోంది. ఢిల్లీ స్థాయిలో ఏపీ ఘటనల మీద ఆందోళన చేపడతారు అని గతంలో ప్రచారం సాగింది. అయితే వైసీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో బొత్తిగా రెండు నెలలు కాకుండానే ఢిల్లీ వెళ్ళి ఏపీలో అక్రమ అరెస్టులు వైసీపీ నేతల మీద అని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. అయితే ఇపుడు రెండేళ్ళు అవుతోంది మళ్ళీ అలాంటి ఆందోళనా కార్యక్రమాలు ఉంటాయా లేక ఏపీలోనే తన పార్టీ వారితోనే విమర్శలతో గడిపేస్తారా అన్న చర్చ సాగుతోంది. మరి జగన్ సేవ్ ఏపీ అన్న స్లోగన్ క్లిక్ అవుతుందా అంటే సోషల్ మీడియాలో చేసే పోరాటాలు సక్సెస్ అయిన దాఖలాలు లేవని అంటున్నారు. మరి వైసీపీ ఈ విషయంలో ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News