ముహూర్త బలం కోసం జగన్ వెయిటింగ్!
పాదయాత్ర చేయాలి. ప్రజల మధ్యకు రావాలి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలి-ఇదీ ఇతమిత్థం గా వైసీపీ పెట్టుకున్న లక్ష్యం;
పాదయాత్ర చేయాలి. ప్రజల మధ్యకు రావాలి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలి-ఇదీ ఇతమిత్థం గా వైసీపీ పెట్టుకున్న లక్ష్యం. ఈలోగా కూటమి సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలి. అయితే.. పోరాటాలను కార్యకర్తలకు, నాయకులకు పరిమితం చేశారు. ఇప్పటి వరకు గత 20 మాసాల్లో చేపట్టి పలు కార్యక్రమాల్లో జగన్ ఏ ఒక్కచోట కూడా పాల్గొనలేదు. జగనే కాదు.. ఆయన సలహాదారు.. కీలక నేత సజ్జల రామకృష్నారెడ్డి కూడా ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు.
ఈ నేపథ్యంలో కార్యకర్తలకు మాత్రమే పోరాటాలు పరిమితం అయ్యాయి. ఇక, ప్రజల మధ్యకు వచ్చేందు కు జగన్ ఇప్పటికే రెండు సార్లు డేట్లు ఇచ్చారన్న ప్రచారం ఉంది. కానీ, ఆయన రాలేదు. గత ఏడాది జూలైలోనే ప్రజల మధ్యకువ స్తానన్నారు. కానీ, కేవలం విజిటింగ్ గెస్ట్ మాదిరిగా వచ్చి వెళ్లారు. ఇక, ఆ తర్వాత.. ఈ ఏడాది జనవరి నుంచి అన్నారు. కానీ.. ఇది కూడా వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా.. పాదయాత్రే ఫైనల్ అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు.
దీనికి 2027-28 వరకు ముహూర్తం లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎందుకంటే..ఇప్పుడే పాదయా త్ర చేపట్టినా.. ఎన్నికల కు సుదీర్ఘ సమయం ఉండడంతో దాని ప్రభావం పెద్దగా పడదని అంటున్నారు. అందుకే ఎన్నికలకు ఏడాది రెండేళ్ల ముందు పాదయాత్ర చేపట్టనున్నారని సమాచారం. కానీ, ఈలోగా స్థానిక ఎన్నికలతోపాటు.. కార్పొరేషన్ ఎన్నికలు కూడా రానున్నాయి. వాటిలో వైసీపీ ఎలా విజయం దక్కించుకోవాలన్నది ప్రధాన చర్చ.
అయినా.. కూడా జగన్ పాదయాత్ర వరకు బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు.. ఆయ న ఆరోగ్యంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మజల్ ప్రాబ్లెం ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నడుము నొప్పి జగన్‌ను వేధిస్తోంది. పైకి ఇవన్నీ చెప్పకపోయినా.. ఆయన వ్యవహార శైలిని గమనిస్తే.. గత రెం డేళ్లుగా ఆయన నొప్పితో బాధపడుతున్నారన్నది వాస్తవం. అందుకే.. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా నిలబడడం లేదు. ఇన్ని ఇరకాటాలను ఎదిరించి.. ఎలా ముందుకు సాగుతారో.. అనేదే అసలైన ముహూర్తంగా చెబుతున్నారు.