మూడేళ్ల‌లో ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న‌.. ఖాయం.. ఎందుకంటే!

ఇక‌, వైసీపీకూడా ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇచ్చే విష‌యంలో ఎలాంటి వివాదాల‌కు అవ‌కాశం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నడంలో సందేహం లేదు.;

Update: 2026-01-19 15:30 GMT

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు వారి ఇల‌వేల్పు.. ఎన్టీఆర్ కు ప్ర‌తిష్ఠాత్మ‌క పౌర‌పుర‌స్కారం.. `భార‌త ర‌త్న‌`ను సాధించాల‌న్న‌ది ప్ర‌తి తెలుగువారి కోరిక‌. ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీల‌కు కూడా అతీతంగా అంద‌రూ ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న కోరుకుంటున్నారు. గ‌తంలో 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు.. భార‌త‌ర‌త్న కోసంప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలో తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ `మేం కూడా ప్ర‌య‌త్నిస్తాం. మ‌ద్ద‌తిస్తాం` అని వ్యాఖ్యానించారు.

ఇక‌, వైసీపీకూడా ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇచ్చే విష‌యంలో ఎలాంటి వివాదాల‌కు అవ‌కాశం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నడంలో సందేహం లేదు. క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ మూడు పార్టీలు కూడా ఎన్టీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు.. మ‌రోసారి ఎన్టీఆ ర్‌కు భార‌త‌ర‌త్న అవార్డుపై చ‌ర్చ ప్రారంభ‌మైంది. మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు ఈ అవార్డును సాధిస్తామ‌ని చెప్పారు. తెలుగువారి గౌర‌వాన్ని నిల‌బెడ‌తామ‌ని.. వారి ఆకాంక్ష‌లు నెర‌వేరుస్తామ‌ని చెప్పారు.

అయితే.. భార‌త‌ర‌త్న వంటి కీల‌క‌మైన ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ఇవ్వాలంటే.. కేంద్రం పూనుకోవాలి. కేంద్రం త‌లుచుకుంటే.. ఎక్క‌డో మూల‌న‌నున్న ముస‌ల‌మ్మ‌కు కూడా అవార్డు రావ‌డం పెద్ద క‌ష్టం కాదు. గ‌త ఏడా ది బీహార్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎవ‌రూ డిమాండ్ కూడా చేయ‌ని.. అక్క‌డి ఓబీసీ నాయకుడు.. అప్ప‌టికే మృతి చెందిన క‌ర్పూరీ ఠాకూర్‌కు భార‌త‌రత్న ఇచ్చారు. త‌ద్వారా.. బీహార్‌లో ఓబీసీ వ‌ర్గాన్ని బీజేపీ త‌న వైపు తిప్పుకొంది. అధికారం నిల‌బెట్టుకుంది.(కూట‌మి స‌ర్కారు).

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. 2029 నాటికి అన్న‌గారికి భార‌త‌ర‌త్న వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. అప్ప‌టికి కానీ... రాష్ట్రంలో ఎన్నిక‌లు లేవు. సో.. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూసి.. అప్ప‌టికి ఉ న్న రాజ‌కీయ ప‌రిణామాలు, వైసీపీ దూకుడును అడ్డుకునేందుకు అన్న‌గారికి భార‌త‌ర‌త్న ఇవ్వడం ద్వారా.. ఆ క్రెడిట్‌ను కూట‌మికి ఆపాదించి.. మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునే వ్యూహం దిశ‌గా బీజేపీ అడుగులు వేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో 2029 నాటికి ఖ‌చ్చితంగా ఎన్టీఆర్‌కు ఈ కార‌ణాల‌తో భార‌త ర‌త్న ల‌భించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Tags:    

Similar News