అప్పుడు బటన్ నొక్కడం...ఇప్పుడు డిజిటల్ బుక్... అందుకే 11 సీట్లు !

అవును కదా. వైసీపీ పెద్దలకు ఎప్పుడు ఏమి చేయాలో అవగతం అవుతోందా అన్నదే చర్చ అంటున్నారు.;

Update: 2025-10-09 03:41 GMT

అవును కదా. వైసీపీ పెద్దలకు ఎప్పుడు ఏమి చేయాలో అవగతం అవుతోందా అన్నదే చర్చ అంటున్నారు. పార్టీ గ్రాఫ్ పెంచే కార్యక్రమాలు ఫ్యాన్ నేతలు ఎపుడు చేశారని కూడా అంతా వేడి నిట్టూర్పులే విడుస్తారు. వైసీపీ అధికారంలో ఉండగానూ అలాగే తీరు ఉందని విపక్షంలోకి వచ్చినా అదే తీరుగా ఉందని అన్న నిష్టూరాలు వినిపిస్తూంటాయి. ఇంతకీ వైసీపీ గురించి ఎరిగిన వారు ఒక్క మాటలో తాజా పరిస్థితిని చెప్పమంటే అప్పుడు బటన్ నొక్కడం...ఇప్పుడు డిజిటల్ బుక్... అందుకే 11 సీట్లు అని తేల్చేస్తారు. ఇంతకంటే వేరే విశ్లేషణ కావాలా అని కూడా అంటారు.

జగన్ క్రేజ్ వెనక రీజన్ :

ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలీ అంటే వైసీపీ అధినేత జగన్ కి ఇంత క్రేజ్ ఈ స్థాయి వచ్చిది అంటే దానికి రెండు కారణాలుగా చెబుతారు. ఒకటి వైఎస్సార్ మరణం, రెండు జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్ర. ఇక ఓదార్పు యాత్ర అంటే ప్రజలతో మమేకం కావడం. తన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వైఎస్సార్ కుటుంబాలను పరామర్శించడం ద్వారా జగన్ లైం లైట్ లోకి వచ్చారు. జగన్ కూడా ఎన్నో అంతస్తులు దిగి తన వైభోగాలను సైతం పక్కన పెట్టేసి జనం కోసం అతి సామాన్యుడిగా వచ్చారు. అంతే కాదు ఆయన తమ ఇళ్ళకు వచ్చి పరామర్శించారు అని జనాలు గుర్తు పెట్టుకుని గుండెలలో పెట్టుకున్నారు ఇలాంటి నాయకుడు కదా కావాల్సింది అన్నారు నాయకత్వ లక్షణం అంటే ఇది కదా అని కూడా జేజేలు పలికారు.

వైఎస్సార్ జన నేతగా :

ఇక జగన్ కి ఈ స్థాయి ఇమేజ్ వచ్చాయి అంటే కచ్చితంగా ఓదార్పు యాత్ర ద్వారా జనాలకు చేరువ కావడమే అని అంటారు. అదే ఆయన రాజకీయాన్ని మలుపు తిప్పి సీఎం దాకా తీసుకుని వచ్చింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక జనాలకు దూరం అయ్యారన్నది నిష్టుర సత్యం అని చెప్పక తప్పదు. అదే వైఎస్సార్ అయితే జననేతగా ముద్ర పడ్డారు. ఆయన ప్రతీ రోజూ ప్రజలను కలిస్తే వారు. ఆతే కాదు వారి సమస్యలను తెలుసుకోవడం వీలైనంతవరకూ పరిష్కరించడం వైఎస్సార్ ప్రజా జీవన విధానంగా మారి చివరి దాకా కొనసాగింది.

జనాలను పోగు చేస్తే :

జనాలను పెద్ద ఎత్తున పోగు చేసి కొంతమందిని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసినంతమాత్రాన క్రేజ్ వస్తుంది అనుకుంటే పొరపాటే అంటున్నారు. జగన్ ఓదార్పు యాత్ర చేసే సమయంలో సోషల్ మీడియా ఇంతలా లేదు, పైగా ఎవరూ పనిగట్టుకుని జగన్ గురించి ప్రచారం చేసి గట్టిగా చెప్పాల్సిన అవసరం కూడా లేకపోయింది అని అంటారు ఎందుకంటే ప్రజలను మించిన పబ్లిసిటీ వేరేది ఉండదు, వారే మౌత్ పబ్లిసిటీ చేస్తారు. జగన్ కూడా ప్రతీ రోజూ ఓదార్పు యాత్ర ద్వారా జనాలను కలిసే వారు అని గుర్తు చేస్తున్నారు వారితోనే తాను నాయకుడిగా మారానని జగన్ అనుకున్నారా అనేంతగా ఆయన జనంతోనే ఉండేవారు.

ఇబ్బంది పడుతున్నారా :

ఇక ఇపుడు చూస్తే జనాలకు కలవాలీ అంటే ఎందుకో జగన్ ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బటన్ నొక్కి మరీ తాడేపల్లి ఆఫీసు నుంచి బయటకు వచ్చేవారు కాదు. జనం అంతా తన వైపే ఉండేవారు అని కూడా జగన్ అనుకునేవారు. ఆ భ్రమలలోనే ఉంటూ అయిదేళ్ళూ ఇట్టే గడిపేసేవారు అని చెబుతారు. ఇలా వ్యవహరించడం వల్ల ఆఖరుకు వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమలో సైతం వైసీపీ దారుణంగా ఓటమి పాలు అయింది. జగన్ సొంత ఇలాకా అయిన కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం మూడంటే మూడు సీట్లు వైసీపీకి వచ్చాయి అంటే గ్రాఫ్ ఎంతలా దిగజారింది అన్న కఠినమైన విశ్లేషణలు వైసీపీ ముందు ఉన్నాయిపుడు.

డిజిటల్ బుక్ అంటూ :

పోనీ ప్రతిపక్షంలో ఉన్నారు కదా జగన్ ఇకనైనా ప్రజలలోకి వస్తారు అనుకుంటే డిజిటల్ బుక్ అంటూ ఆయన ఒక దానిని ప్రవేశపెట్టారు. దాంతో ఎవరినీ కలవకుండా జగన్ వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఇలా ఉంటే ఎలా స్వామీ అని పార్టీ నాయకులు కూడా అంటున్నారుట. ప్రజలను ప్రతీ రోజూ కలిస్తేనే కదా వారికి చేరువ అయ్యేది, వారి సమస్యలను కూడా పరిష్కరించేందుకు నేతగా వారి ముందు నిలిచేది అని అంటున్నారు. విపక్షంలో ఉన్న నాయకులకి ఇది అత్యవసరం అని చెబుతున్నారు. ప్రజా సమస్యలు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతలా పార్టీ అధికార పార్టీ మీద పోరాటం చేయడానికి వీలు అవుతుందని అంటున్నారు ఇక వైసీపీ అధినాయకత్వం వ్యవహార శైలి చూస్తూంటే ఏదో తప్పు చేసినట్లుగా తప్పించుకుటూ సైడ్ అవుతున్నట్లుగానే ఉంది అని కామెంట్స్ వస్తున్నాయి. నిజమైన నాయకత్వం అంటే జనంలో ఉండాలి కదా అని అంటున్నారు. ఓటమి అన్నది వైసీపీకి కొత్త కాదు, 2014లో కూడా ఓటమి చెందారు, కానీ ఈసారి దానిని ఎందుకు తీసుకోలేకపోతున్నారు అన్నదే ప్రశ్నగా ఉంది. ప్రజలే తప్పు చేశారు వారే ఆదరిస్తారు అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. అసలైన రాజకీయం చేయాలి అంటే జనంలోనే నిత్యం ఉండాలని ఆ విధంగా చేయకపోతే ప్రత్యర్ధుల కోసం అని ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్కే వైసీపీని మింగేస్తుంది అని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

Tags:    

Similar News