తాడేపల్లికి జగన్...వరస భేటీలేనట !

జగన్ అలా లండన్ ఫ్లైట్ ఎక్కారో లేదో ఇలా ఏపీలో రాజకీయం హీటెక్కింది. కల్తీ మద్యం కేసులో కూటమి ప్రహుత్వాన్ని ఇరుకున పెడతామని చూసిన వైసీపీకి ఇపుడు అదే ఇష్యూ ఇబ్బంది పెడుతోంది .;

Update: 2025-10-20 15:36 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ టూర్ ముగిసింది. ఆయన సోమవారం బెంగళూరు కి చేరుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక జగన్ మంగళవారం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు అని వెల్లడించాయి. దాంతో పది రోజుల లండన్ టూర్ తరువాత అధినేత తాడేపల్లికి రావడంతో ఆయనతో భేటీ అయ్యేందుకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు.

ఇష్యూస్ అనేకం :

జగన్ అలా లండన్ ఫ్లైట్ ఎక్కారో లేదో ఇలా ఏపీలో రాజకీయం హీటెక్కింది. కల్తీ మద్యం కేసులో కూటమి ప్రహుత్వాన్ని ఇరుకున పెడతామని చూసిన వైసీపీకి ఇపుడు అదే ఇష్యూ ఇబ్బంది పెడుతోంది అని అంటున్నారు. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ కి ఈ కేసు ఉచ్చు బిగించేలా ఉందని అంటున్నారు. అంతే కాకుండా కల్తీ మద్యం వెనక వైసీపీ నేతలే ఉన్నారని కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. దాంతో ఈ కేసు విషయంలో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందో అన్న చర్చ ఉంది. జగన్ దీని మీద పార్టీ నేతలకు ఏ విధంగా దిశా నిర్దేశం చేస్తారో అన్నది కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

కూటమి సక్సెస్ తో :

రాయలసీమకు మూల కేంద్రంగా ఉన్న కర్నూల్ లో నడిబొడ్డున జరిగిన కూటమి సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఏకంగా మూడు లక్షల మంది జనాలు ఈ సభకు తరలి వచ్చారు. ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వేదిక మీద నిలిచి కూటమి పదహరు నెలల పాలన ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి గురించి జనాలకు అంతా చెప్పారు. అదే సమయంలో కూటమి ఎంత ఐక్యంగా ఉందో కూడా ఈ సభ చాటి చెప్పింది. ఒక విధంగా ఇది వైసీపీకి సవాల్ గా మారింది అన్నది వాస్తవం. కూటమి పటిష్టంగా ఉందని రానున్న రోజులలో మరింతగా బలోపేతం అయి 2029 ఎన్నికలను ఎదుర్కొంటుందని స్పష్టంగా తెలియచెప్పిన వేళ వైసీపీ రానున్న కాలంలో యాక్షన్ ప్లాన్ ఏమిటి అన్నది కూడా చూడాలని అంటున్నారు.

కోటి సంతకాలు :

ఇక చూస్తే కనుక జగన్ లండన్ టూర్ కి వెళ్ళే ముందు పార్టీ క్యాడర్ కి కోటి సంతకాల సేకరణ పేర్తుతో ఒక బిగ్ టాస్క్ ని ఇచ్చారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తున్నారని దానిని వ్యతిరేకిస్తూ జనాల నుంచి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేయాలన్నదే ఈ ఆందోళన వెనక ఉన్న లక్ష్యం. మరి అది ఎంతవరకూ వచ్చింది అన్నది కూడా చూడాల్సి ఉంది. విషయానికి వస్తే చాలా చోట్ల కోటి సంతకాల సేకరణ అయితే పెద్దగా సాగుతున్నట్లుగా లేదని అంటున్నారు. మరి దీని మీద పార్టీ నాయకులతో జగన్ ఏమి మాట్లాడుతారు ఎలా దిశా నిర్దేశం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.

ట్వీట్స్ తో స్టార్ట్ :

జగన్ లండన్ నుంచి బెంగళూరు కి వస్తూనే తన ట్విట్టర్ హ్యాండిల్ కి పని చెప్పారు. ఆయన ఒక వైపు జనాలకు దీపావళి సుభాకాంక్షలు చెబుతూనే మరో వైపు చంద్రబాబు మీద విమర్శలు చేశారు. ఆయనను చీకటికి ప్రతినిధిగా అభివర్ణించారు. వైసీపీ హయాంలో ముప్పయి దాకా పధకాలను దీపాలుగా వెలిగించి అమలు చేస్తే వాటిని అన్నింటినీ ఆర్పేశారు అని మండిపడ్డారు. కూటమి పధకాలు కూడా పెద్దగా జరగడం లేదని అరకొరగా ఉన్నాయని అనేక హామీలు కూడా ఇంకా అమలు చేయడంలేదని కూడా విమర్శించారు.

Tags:    

Similar News