• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆర్జీవీపై తమ్ముళ్ల ఆగ్రహం...

ఆర్జీవీపై తమ్ముళ్ల ఆగ్రహం పీక్స్... అంత మాట అనేశారేంటి?

| ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై మరికొన్ని ఫిర్యాదులు అందయని తెలుస్తోంది. ఈ నేపథ్యలంలో తాజాగా మరోకేసు నమోదైంది.

By - Tupaki Desk
Update: 2024-11-21 11:00 GMT

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవ్వడం.. రెండు సార్లు నోటీసులివ్వడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 19నే విచారణకు హాజరవ్వాల్సి ఉండగా వర్మ టైం అడిగారు.. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలంటూ మరోసారి వర్మకు నోటీసులు పంపించారు ఒంగోలు పోలీసులు.

మరోపక్క తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు! దీంతో... ఈ నెల 25న వర్మ ఒంగోలు ప్రయాణంపై తీవ్ర ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. అయితే అక్కడితో అయిపోలేదు! ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై మరికొన్ని ఫిర్యాదులు అందయని తెలుస్తోంది. ఈ నేపథ్యలంలో తాజాగా మరోకేసు నమోదైంది.

అవును.. ఆర్జీవీకి కూడా మొదలైపోయిందనే చర్చకు బలం చేకూర్చే ఘటనలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కేసు నమోదవ్వడం, దానికి సంబంధించిన నోటీసులు అందించడం, విచారణ తేదీ ఫిక్స్ చేయడం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా అనకాపల్లి, కడపలో ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

ఇందులో భాగంగా... అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులకు ఆర్జీవీపై ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణకు రావాలంటూ వర్మకు నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన వర్మ తనకు వారం రోజుల సమయం కావాలంటూ తన తరుపు న్యాయవాదులతో పోలీసులకు కబురు పంపించారు!

ఇదే సమయంలో... కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనూ ఆర్జీవీపై ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఐటీడీపీ నేతలు ఆర్జీవీపై ఫిర్యాదులు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, వంగలపూడి అనితలపై ఆర్జీవీ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలను కించపరిచేలా అనేక పోస్టులు పెట్టారని పేర్కొన్నారు.

ఈ సమయంలో స్పందించిన ఐటీడీపీ నేతలు.. ఆర్జీవీని కఠినంగా శిక్షించాలని కోరుతూ, అతనిని జనజీవన స్రవంతిలో ఉంచవద్దని.. అరెస్ట్ చేసి అడవులకు తరలించాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు!

Tags:    
  • Ramgopalvarma 
  • RGV 
  • Appolice 
  • Andhrapradesh 
  • ITDPLeaders 
  • Chandhrababu 
  • Pawankalyan 
  • Naralokesh 
  • Ongolepolice 
  • RGVCases 
  • Vyuhammovie 

Similar News

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS